news18-telugu
Updated: August 24, 2020, 7:16 AM IST
కాజల్,సమంత,తమన్నా (File/Photos)
తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంతతో కానీది కాజల్, తమన్నాకు మాత్రం సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. ‘ఏమాయ చేసావే’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సమంత.. ఆ తర్వాత హీరోయిన్గా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యను రియల్ లైఫ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సామ్ కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్లు సాగిపోతుంది. ఇన్నేళ్ల కెరీర్లో సమంత మాత్రం.. కాజల్ తమన్నా చేసిన ఆ పని చేయలేకపోయింది. ఇంతకీ మ్యాటరేమిటంటే.. చిత్ర పరిశ్రమలో కొడుకుతో యాక్ట్ చేసిన హీరోయిన్లు.. తండ్రితో నటించడం చాలా అరుదుగా ఉంటారు. కానీ కాజల్, తమన్నాలతో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత మాత్రంఇంత వరకు హీరోలైన తండ్రి కొడుకుల సరసన కథానాయికగా నటించలేదు. నాగార్జున సినిమాలో సమంత నటించిన అది హీరోయిన్ పాత్ర కాదు. అదే కాజల్, తమన్నాల విషయానికొస్తే.. వీళ్లిద్దరు రామ్ చరణ్‌తో నటించారు.

కాజల్ అగర్వాల్ తమన్నా (kajal aggarwal tamannaah)
కాజల్.. రామ్ చరణ్‌తో ‘మగధీర’ ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాల్లో జోడిగా నటించింది. ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో చిరు సరసన ఆడిపాడింది. ఇక తమన్నా విషయానకొస్తే.. ఈమె రామ్ చరణ్ సరసన ‘రచ్చ’లో ఓ రేంజ్లో తన అందాలతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్ సరసన మెరిసింది. ఈ రకంగా వీళ్లిద్దరు తండ్రి కొడుకుల సరసన కథానాయికగా నటించిన హీరోయిన్ల లిస్టులో చేరారు. వీరిద్దరితో పాటు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి (File/Photos)
రకుల్ ప్రీత్ సింగ్.. నాగ చైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత చైతూ ఫాదర్ నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ లో నాగ్‌కు జోడిగా నటించింది. అటు లావణ్య త్రిపాఠి కూడా నాగ చైతన్యతో ‘యుద్ధం శరణం’లో జోడిగా నటించింది. అటు నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ రకంగా తెలుగు ఇండస్ట్రీలో కథానాయికలుగా వీళ్లు తండ్రీ కొడుకులు సరసన నటించారు. కానీ ఎంతో టాలెంట్ ఉన్న సమంత మాత్రం ఆ ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. ఫ్యూచర్లో కూడా దక్కే అవకాశాలు లేవు. ఏమైనా హీరోలైన తండ్రీ కొడుకుల సరసన నటించకపోయినా.. హీరోయిన్గా సమంత క్రేజే వేరని చెప్పాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 24, 2020, 7:16 AM IST