హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni : న్యూ ఇయర్ వేడుకల్లో సమంత అక్కినేని.. ఫ్రెండ్స్‌తో కలిసి అందాల విందు..

Samantha Akkineni : న్యూ ఇయర్ వేడుకల్లో సమంత అక్కినేని.. ఫ్రెండ్స్‌తో కలిసి అందాల విందు..

భర్త, ఫ్రెండ్స్‌తో సమంత న్యూ ఇయర్ వేడుకలు.. Photo : Instagram

భర్త, ఫ్రెండ్స్‌తో సమంత న్యూ ఇయర్ వేడుకలు.. Photo : Instagram

Samantha Akkineni : సమంత.. ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు.

Samantha Akkineni : సమంత.. ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమైన సమంత.. ఆ సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత.. ఆ తర్వాత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉంటోన్న సమంత అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది. అక్కడ సినీ సెలెబ్రీటీలతో మాట్లాడుతూ వారిని ఇంటర్వూ చేస్తూ అలరిస్తోంది. ఇక అది అలా ఉంటే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో సమంత తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఆ ఫోటోలో సమంత కాస్తా హాటుగా కనిపించి కనుల విందు చేసింది. భర్త చైతన్య కూడా ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా నాగ చైతన్యతో కలిసి సమంత పార్టీ చేసుకున్నట్లు తెలిపింది.

ఇక సమంత ఈ మధ్య కాస్తా హీటు పెంచిందనే చెప్పాలి. సమంత ఇటీవల కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేసిన సమంత ఆ వీడియోలో... ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న డ్రెస్సుల్నీ చూపిస్తూ.. ఇవన్ని నేను చాలా ఇష్టపడి కుట్టించుకున్నాను. అయితే అలాంటీ సందర్భం రాలేదు. వాటినీ వేసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో సమంత వివిధ సందర్భాల్లో ధరించాలనుకున్న దుస్తుల్నీ ధరించి కేక పెట్టించింది. ఇక ఇటీవల తన క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సాకి పేరుతో మొదలైన ఈ క్లాతింగ్ బ్రాండ్‌కు సమంతనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తనవంతు కృషి చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్ గా సాకి ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైల్ కాస్టూమ్ తో దర్శనమిచ్చిందని అంటున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. జాను తర్వాత కొత్త సినిమా ఏది ఓకే చెప్పని సమంత లేటెస్ట్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పింది.


నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ భామ గురించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏమంటే.. ఓపక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోందట. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..  ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు.


ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఒకేసారి తెలుగు తమిళ, హిందీ భాషాల్లో స్ట్రీమ్ కానుంది.

First published:

Tags: Samantha akkineni, Tollywood news

ఉత్తమ కథలు