Samantha: సమంత అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సామ్ నట విశ్వరూపం చూడడానికి డేట్ లాక్ అయింది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఏ హీరోయిన్ కెరీర్ అయిన పెళ్లి తర్వాత పెద్ద గొప్పగా ఏమి ఉండదు. అప్పటి వరకు తమ కలల రాణిగా ఊహించుకునే అభిమానులు.. కథానాయికలు పెళ్లి చేసుకోగానే.. వాళ్లపై అప్పటి వరకు చూపించిన అభిమానంలో కూడా మార్పులు వస్తాయి. కానీ సమంత వంటి కొంత మంది కథానాయికలు మాత్రమే పెళ్లి తర్వాత తమ కెరీర్‌ను మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్లు సాగుతూనే ఉంది. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా తనదైన శైలిలో దూసుకుపోతుంది. మరోవైపు సమంత.. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. 2019లో అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.
దాదాపు 12 నుంచి 13 ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్యపాత్రలో నటించాడు. ప్రియమణి కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ రెండో భాగంలో సమంత ‘రాజీ’ అనే విలన్ పాత్రలో నటిస్తోంది. చెహ్రె కే పీచే చెహ్రా.. రాజ్ హై ఇస్మే గెహ్రా .. అంటూ సమంత పాత్రను పరిచయం చేసారు. అంటే ముఖం వెనకాల మరో ముఖం .. ఏ గుట్టు రహస్యం తెలియాంటే ఫిబ్రవరి 12 వరకు ఆగాల్సిందే అంటూ చెప్పారు.
ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు వాళ్లైన రాజ్ డికే డైరెక్ట్ చేసారు. మొదటి పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన సమంతకు ఈ వెబ్ సిరీస్‌లో రాజీ పాత్ర ఓ ఛాలెంజింగ్ రోల్. ఆమె టెర్రరిస్టుగా ఎందుకు మారింది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనేది ఈ వెబ్ సిరీస్‌లో చూడాల్సిందే. మొత్తంగా సమంత నట విశ్వరూపం చూడాలంటే ఫిబ్రవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.