Home /News /movies /

Samantha Akkineni : హాట్ స్టార్‌లో సమంత కొత్త సినిమా.. దీపావళికి స్ట్రీమింగ్..

Samantha Akkineni : హాట్ స్టార్‌లో సమంత కొత్త సినిమా.. దీపావళికి స్ట్రీమింగ్..

Samantha Akkineni  Photo : Instagram

Samantha Akkineni Photo : Instagram

Samantha Akkineni : సమంత, నయనతార కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.

    అక్కినేని సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ వీడియోను కూడా పంచుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha akkineni )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.

    ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.



    ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.

    Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే...

    దీనికి సంబంధించి హాట్ స్టార్‌తో డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. దీపావళికి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక  ఈ సినిమా నుంచి ఇటీవల రెండు అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక సమంత ఇటీవల అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ అనేక వివాదాల నడుమ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ వెబ్ సీరిస్‌లో సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించింది. రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్‌, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించింది. నెటిజన్స్ ప్రశంసలు అందుకున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akkineni samantha, Nayanthara, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు