బాలీవుడ్‌కు జంటగా వెళుతున్న సమంత అక్కినేని నాగ చైతన్య..

అక్కినేని అభిమానులకు శుభవార్త.  అవును అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా ఇపుడు బాలీవుడ్‌కు వెళుతున్నారు. వీళ్లిద్దరు పెళ్లైన తర్వాత  జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా తెలుగులో మంచి విజయాన్నే సాధించింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2020, 3:44 PM IST
బాలీవుడ్‌కు జంటగా వెళుతున్న సమంత అక్కినేని నాగ చైతన్య..
దాంతో ప్రశ్న అడిగిన వాడికి కూడా దిమ్మ తిరిగిపోయింది. మొత్తానికి పిల్లల విషయంలో తమ కుటుంబానికి లేని ఆసక్తి మీకెందుకు అన్నట్లుగా ఇన్‌డైరెక్ట్ సమాధానం ఇచ్చింది సమంత అక్కినేని.
  • Share this:
అక్కినేని అభిమానులకు శుభవార్త.  అవును అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా ఇపుడు బాలీవుడ్‌కు వెళుతున్నారు. వీళ్లిద్దరు పెళ్లైన తర్వాత  జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లోనే మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడిగా శివ నిర్వాణ కూడా ఈ సినిమాను డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు వెళుతుంది. ఇక హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయకుండా.. డైరెక్ట్‌గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా ‘మజిలీ’ టైటిల్ అని కన్ఫామ్ చేసారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తికావొచ్చాయని సమాచారం. త్వరలోనే యూట్యూబ్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శితం కానుంది.

samantha akkineni naga chaitanya super hit film majili to dubbed in hindi here are the details,Naga Chaitanya,samantha,naga chaitanya samanhta majili.naga chaitanya samanhta majili hindi version,naga chaitanya samanhta majili hindi dubbed version, naga chaitanya samantha,samantha twitter,samantha instagram,samantha facebook,naga chaitanya twitter,naga chaitanya facebook,naga chaitanya instagram,Naga Chaitanya Parasuram,naga chaitanya samantha parasuram,Naga Chaitanya Vijay Devarakonda Parasuram Directin, Naga chaitanya Parasuram Direction, Naga Chaitanya Next Movie With Geetha Govindam Fame Parashuram Direction, Tollywood News, Telugu cinema, నాగ చైతన్య, నాగ చైతన్య పరశురామ్, నాగ చైతన్య విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్, అక్కినేని నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్, తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్,పరశురామ్,పరశురామ్ నాగచైతన్య,నాగ చైతన్య,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్
‘మజిలీ’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ (Twitter/Photo)


ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా నటించిన జాను థియేటర్స్‌లోె విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకోవైపు నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. పూర్తి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కోతున్న ఈ చిత్రంపై చాలానే అంచనాలే ఉన్నాయి. మరోవైపు నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోతున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్..‘బంగార్రాజు’లో నాగార్జున మనవడి పాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి నాగ చైతన్య , సమంత డైరెక్ట్‌గా హిందీలో ఎంట్రీ ఇవ్వకుండా.. ఇలా డబ్బింగ్ సినిమాతోనైనా జంటగా ఎంట్రీ ఇవ్వడం చూసి అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 8, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading