లాక్‌డౌన్ కారణంగా ఎలాగూ బయటికి వెళ్లలేని పరిస్థితి.. దాంతో ఇంట్లోనే లాక్ అయిపోయారు అంతా. ఇప్పుడు సమంత, నాగ చైతన్య కూడా ఇంటి నుంచి కాలు బయటికి పెట్టేది లేదు. అందుకే వాళ్లు ఈ లాక్ డౌన్ సమాయాన్ని కావాల్సినట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్లు ఉంటున్న అపార్ట్‌మెంట్ చాలా పెద్దది. గేటెడ్ కమ్యూనిటీ అనే పదం కూడా చిన్నదే అవుతుంది. మురళీ మోహన్ తన కొడుకు కోసం ప్రత్యేకంగా కట్టించుకున్న ఇంటిని నాగార్జున రిఫరెన్సుతో చైతూ అడగడంతో ఇచ్చేసాడు. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఎలాగూ బయటికి వెళ్లేది లేదు కాబట్టి హాయిగా ఇంట్లోనే వంటలు నేర్చుకుంటుంది సమంత.
ఇప్పటికే మష్రూమ్ పాస్తా చేసి అత్త అమలకు సవాల్ కూడా చేసింది. ఇదిలా ఉంటే సాయంత్రం అయ్యేసరికి హాయిగా తన భర్త చైతూ, పెంపుడు కుక్కతో కలిసి తన అపార్ట్‌మెంట్ అంతా రౌండ్ వేస్తుంది సమంత. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికితోడు జిమ్‌లో కూడా కష్టపడుతుంది సమంత. ఏకంగా 100 కేజీల బరువులను కూడా ఈజీగా ఎత్తేస్తుంది ఈ భామ. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు.. చైతూతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంది సమంత. పెళ్లి తర్వాత ఇంత సమయం ఎప్పుడూ ఇద్దరమే కలిసి ఎప్పుడూ ఉండలేదని చెబుతుంది స్యామ్. హాయిగా క్వారంటైన్ అంతా నువ్వు నేను అంటూ ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ. మరో నెల రోజుల వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉండేలా కనిపిస్తుంది. దాంతో హాయిగా ఇంటి పట్టునే ఉండి మరిన్ని వంటలు కూడా నేర్చుకోవాలని చూస్తుంది. దాంతో పాటు కుక్కతో కూడా ఆడుకుంటుంది సమంత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood