SAMANTHA AKKINENI NAGA CHAITANYA HOUSE VIDEO GOING VIRAL AND WILL YOU SEEN THAT PK
Samantha - Naga Chaitanya: సమంత, నాగ చైతన్య ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా తక్కువే..!
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
Samantha - Naga Chaitanya: పెళ్లికి ముందు నుంచి కూడా చైతూ ఒక్కడే వేరుగా ఉంటున్నాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత హాయిగా తన భార్య సమంతతో కలిసి కొత్త ఇళ్లు తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
పెళ్లికి ముందు నుంచి కూడా చైతూ ఒక్కడే వేరుగా ఉంటున్నాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత హాయిగా తన భార్య సమంతతో కలిసి కొత్త ఇళ్లు తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో కుక్కతో చైతూ, సమంత ఆడుకుంటున్నారు. ఆ కుక్క పిల్ల ఇళ్లంతా తిరుగుతుంటే.. సమంత చైతూ ఇళ్లు కూడా ఎంత విశాలంగా ఉందో అర్థమైపోతుంది. అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దానికి తోడు జిమ్ కూడా సపరేట్గా ఉంది. లగ్జరీ అనే పదానికి నిదర్శనంగా ఈ ఇళ్లు ఉంది. స్విమ్మింగ్ పూల్‌లో చైతూ స్నానం చేస్తుంటే కుక్క కూడా జంప్ చేసింది. ఇదంతా సమంత వీడియో తీస్తుంది. ఇది చూసి అమ్మో చైతూ స్యామ్ ఇళ్ళు బాగానే పెద్దగా ఉందిగా.. ఇంత పెద్దింట్లో ఇద్దరే ఉంటున్నారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే ఈ ఇంటి వెనక పెద్ద కథ ఉంది. పెళ్లి తర్వాత ఇల్లు తీసుకోవాలని తిరుగుతున్న సమయంలో చాలా ఇళ్లు చూసిన చైతూకు ఒక్కటి కూడా నచ్చలేదు. ప్రతీ ఇంట్లో ఏదో ఓ సమస్య కనిపిస్తూనే ఉండటంతో విసిగెత్తిపోయాడు నాగ చైతన్య. అలాంటి సమయంలో మురళీ మోహన్ ఇల్లు చూసాడు.. అది ఆయనకు బాగా నచ్చేసింది. వెంటనే వెళ్లి అంకుల్ ఇది నాకు కావాలని చైతూ అడిగేసాడు. మురళీ మోహన్ మాత్రం ఇది అమ్మడానికి కాదు బాబు.. తనకు, తన కొడుకు, తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా కట్టుకున్నామని చెప్పాడు. అయితే ఇల్లు బాగా నచ్చడంతో వెంటనే ఇంటికి వెళ్లి నాగార్జునకు విషయం చెప్పాడు చైతూ.
అంతే వెంటనే నాగ్ రంగంలోకి దిగాడు. సిటీలో ఎన్నో ఇల్లు చూసిన చైతూకు మీ ఇల్లు మాత్రమే బాగా నచ్చింది.. ఓసారి చూడండి మురళీ మోహన్ గారూ అంటూ నాగ్ చెప్పడంతో ఆయన కూడా మనసు మార్చుకున్నాడు. నాగార్జున కుటుంబంతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఇద్దరం కలిసి చాలా సినిమాలు కూడా చేసామని చెప్పాడు మురళీ మోహన్. ఇంటికి వెళ్లి బాబు చెప్పినట్లున్నాడు అందుకే వెంటనే నాగార్జున కూడా తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నాడు ఈయన.
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
చైతూ ఇష్టాన్ని కాదనలేక.. తన కొడుకు మరో ఇంటికి మారిపోయాడని.. దాంతో తన కొడుకు కోసం కట్టిన ఫ్లాట్‌ను చైతూకు ఇచ్చేసానని చెప్పాడు మురళీ మోహన్. 14వ ఫ్లోర్లో పూర్తిగా సౌకర్యాలతో ఉండే ఈ ఇంటిని మనసు పడి మరీ కొనుక్కున్నాడు చైతూ. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.