Ram Charan Upasana Chiatu Samantha : రామ్ చరణ్, ఉపాసన ఆదర్శం అంటున్న నాగ చైతన్య, సమంత..

Ram Charan Konidela Upasana Naga Chaitanya Akkineni Samantha | అవును నాగ చైతన్య, సమంత ఇపుడు తమకు రామ్ చరణ్, ఉపాసన దంపతులే ఆదర్శం అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 29, 2020, 8:13 AM IST
Ram Charan Upasana Chiatu Samantha : రామ్ చరణ్, ఉపాసన ఆదర్శం అంటున్న నాగ చైతన్య, సమంత..
రామ్ చరణ్,ఉపాసన,నాగ చైతన్య, సమంత దంపతులు (File/Photos)
  • Share this:
Ram Charan Konidela Upasana Naga Chaitanya Akkineni Samantha | అవును నాగ చైతన్య, సమంత ఇపుడు తమకు రామ్ చరణ్, ఉపాసన దంపతులే ఆదర్శం అంటున్నారు. వివరాల్లోకి వెళితే..  తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని, మెగా ఫ్యామిలీలకు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున అబ్బాయిగా నాగ చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తాను హీరోగా మొదటి సక్సెస్ అందుకున్న సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమా హీరోయిన్ సమంత మాయలో పడిపోయాడు. అంతేకాదు ఆమెను ఏరి కోరి వరించాడు. వీళ్లిద్దరి పెళ్లి మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇక రామ్ చరణ్, ఉపాసనల విషయానికొస్తే..  రీసెంట్‌గా వీరు 8వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే.. చిరంజీవి అడుగుజాడల్లో హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడుగా రాణిస్తున్నాడు.

Samantha Akkineni Naga Chaitanya Follows Ram charan Upasana in this way here are the details,ram charan,upasana,ram charan konidela upasana,Naga chaitanaya akkineni samantha,Naga chaitanya samantha dont wont childresn,Naga chaitanaya akkineni,Samantha Akkineni,samantha twitter,samantha instagram,ram charan upasana naga chaitanya samantha,ram charantwitter,upasana konidela kamineni,upsasana twitter,ram charan upasana,ram charan upasana 8th wedding anniversary,ram charan upasana wedding anniversary,ram charan and upasana wedding,ram charan and upasana marriage anniversary,ram charan upasana,ram charan and upasana,ram charan,ram charan upasana wedding,ram charan wedding,ram charan upasana marriage,ram charan upasana at ntr wedding anniversary,ram charan and upasana konidela wedding anniversary,ram charan marriage,ram charan tej weds upasana,ram charan tej wedding live,upasana with ram charan,ram charan tej wedding,రామ్ చరణ్,ఉపాసన,రామ్ చరణ్ ఉపాసన 8వ పెళ్లిరోజు,రామ్ చరణ్ ఉపాసన,రామ్ చరణ్ ఉపాసన పిల్లలు,నాగ చైతన్య సమంత,సమంత,నాగ చైతన్య,నాగ చైతన్య సమంత దంపతులు,రామ్ చరణ్ ఉపాసన దంపతులు,
నాగ చైతన్య, సమంత,రామ్ చరణ్,ఉపాసన దంపతులు (File/Photos)


అంతేకాదు హీరోగా పీక్‌లో ఉండగానే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది.  2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే..  అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను ఎంతో ఓపికగా నిర్వహిస్తోంది.

రామ్ చరణ్, ఉసానస (File/Photo)


ఐతే.. రామ్ చరణ్.. ఉపాసన  పెళ్లై ఎనిమిదేళ్లు అవుతున్న వీరిద్దరికి పిల్లలు లేరు. అదే వేరే హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్,  అల్లు అర్జున్ వంటి తోటి హీరోలకు ఇద్దరేసి పిల్లలు ఉన్నా.. వీళ్లకు మాత్రం పిల్లలు లేరు. ఈ విషయమై టాలీవుడ్‌లో ఇప్పటికీ చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ‌ వీళ్లిద్దరు పిల్లలు వద్దనుకోవడానికి పెద్ద రీజనే ఉందని చాలా సందర్భాల్లో చెప్పారు. మరోవైపు నాగ చైతన్య, సమంత దంపతులు కూడా పెళ్లై మూడేళ్లు అవుతున్న వీళ్లు పేరేంట్స్ ఎపుడు అవుతారు అని అందరు డైరెక్ట్‌గా ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Samanatha Akkineni Naga Chaitanya celebrates Glorious 3rd Wedding Anniversary
నాగ చైతన్య, సమంత (Instagram/Photo)


తాజాగా నాగ చైతన్య ఓ యాడ్ షూటింగ్ సందర్భంలో తాము ఇపుడే అమ్మానాన్నలము కావాలనుకోవడం లేదంటూ చెప్పకనే చెప్పేశారు. రీసెంట్‌గా వచ్చని యాడ్‌లో సమంత పిల్లల డ్రెస్ ఫోటోలు చూపించి వీరు క్యూట్‌గా ఉన్నారనడం.. చైతూ.. ఇపుడు అలాంటివేం ప్లాన్ చేయకిన చెప్పడం ద్వారా తాము తల్లి తండ్రులం ఎపుడు అవుతారనేదానికి సమాధానం ఇచ్చేశారు. మొత్తంగా రామ్ చరణ్, ఉపాసన దంపతుల మాదిరే వీళ్లు కూడా సంతానం కోసం ఇపుడిపుడే తొందర పడటం లేదనే విషయాన్ని యాడ్ రూపంలో ఇన్‌ డైరెక్ట్‌గా చెప్పారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 29, 2020, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading