70 ఏళ్ల పడుచు అమ్మాయిగా సమంతా... ‘ఓ బేబీ’ ట్రైలర్‌లో జీవించేసిందిగా...

Oh Baby Trailer : లేడీ ఓరియెంటెండ్ కథతో మరోసారి క్యూట్ బ్యూటీ సమంతా తన మార్క్ చూపించబోతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 20, 2019, 10:52 AM IST
70 ఏళ్ల పడుచు అమ్మాయిగా సమంతా... ‘ఓ బేబీ’ ట్రైలర్‌లో జీవించేసిందిగా...
ఓ బేబీ ట్రైలర్ రిలీజ్
  • Share this:
70 ఏళ్ల ముసలామె... 24 ఏళ్ల పడుచు అమ్మాయిలా మారితే ఎలా ఉంటుంది? ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? చుట్టూ ఉన్న సమాజంతో ఆమె సెట్ కాగలదా? వంటి వరైటీ కాన్సెప్టుతో వస్తున్న సినిమా ఓ బేబీ. ఇందులో సమంతా అక్కినేని పాత్రే కీలకం. లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి రూపొందిస్తున్న‘ఓ బేబీ’ ప్రపంచవ్యాప్తంగా జూలై 5న రిలీజవుతోంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజై... దుమ్మురేపుతోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ప్రోమోస్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


ట్రైలర్‌కి మంచి మార్కులే పడ్డాయి. కొంత కామెడీ, కొంత కన్‌ఫ్యూజన్, కొంత సెంటిమెంట్... అన్నీ కలగలిపి... ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనిపించేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.
First published: June 20, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading