పెళ్లి తర్వాత సమంత దూకుడు మాములుగా లేదుఈమె కథానాయికగా నటించిన సినిమాలు వరుసపెట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ ఇయర్ మొదట్లో తన భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ సినిమా, ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీటైంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇదే రోజున బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమాతో పాటు రవితేజ కథానాయకుడిగా నటించిన ‘డిస్కోరాజా’, సాయి ధరమ్ తేజ్.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు విడుదల కానున్నాయి.
వీటి మధ్యలో సమంత సినిమాను విడుదల చేయడం ఎందుకని ‘96’ తెలుుగు రీమేక్‌ను వచ్చే యేడాదికి పోస్ట్ చేసినట్టు సమాచారం. ఏమైనా ముగ్గురు హీరోల వల్ల సమంత తన రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, PratiRoju Pandaage, Raviteja, Ruler, Sai Dharam Tej, Samantha Ruth Prabhu, Telugu Cinema, Tollywood