news18-telugu
Updated: August 16, 2019, 10:48 AM IST
కియారా అద్వానీ,సమంత అక్కినేని (Twitter/Photos)
పెళ్లి తర్వాత సమంత అక్కినేని దూకుడు మాములుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఇది వరకటిలా గ్లామర్ పాత్రలు కాకుండా.. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఈ యేడాది ఇప్పటికే తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ‘ఓ బేబి’గా తన సత్తా చూపెట్టింది. ఒకవైపు అక్కినేని ఇంటి కోడలిగా తనవద్దకు వచ్చే సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది. తాజాగా సమంత.. తన దృష్టిని వెబ్ సిరీస్ పై మళ్లించనున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో చాలా మంది కథానాయికలు సినిమాలు కాకుండా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇపుడు అదే రూట్లో త్వరలో సమంత... ఒక వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ కూడా ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్‌తోనే కియారాకు కథానాయికగా వరుస అవకాశాలొచ్చాయి. ఒక సమంత యాక్ట్ చేసే వెబ్ సిరీస్ తెలుగు,హిందీ, తమిళంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఏమైనా ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 16, 2019, 10:48 AM IST