హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: సమంత ఖాతాలో మరో ఖతార్నాక్ రికార్డు.. అక్కినేని కోడలు దూకుడు మాములుగా లేదుగా..

Samantha: సమంత ఖాతాలో మరో ఖతార్నాక్ రికార్డు.. అక్కినేని కోడలు దూకుడు మాములుగా లేదుగా..

సమంత (Samantha in Family man Photo : Instagram)

సమంత (Samantha in Family man Photo : Instagram)

Samantha: సమంత ఖాతాలో మరో ఖతార్నాక్ రికార్డు.. అక్కినేని కోడలు దూకుడు మాములుగా లేదుంటున్నారు ఆమె అభిమానులు.

Samantha: సమంత ఖాతాలో మరో ఖతార్నాక్ రికార్డు.. అక్కినేని కోడలు దూకుడు మాములుగా లేదుంటున్నారు ఆమె అభిమానులు. సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్  సిరీస్‌‌లు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీలో సమంత అక్కినేని ఇంటర్వ్యూలు చేసి నిజంగానే ఆహా అనిపించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో LTTE తీవ్రవాది రాజీ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మన దేశంలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రికార్డులకు ఎక్కింది. ఈ వెబ్ సిరీస్‌‌ను తెలుగు వాళ్లైన రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఇందులో సమంత పాత్రపై తమిళనాడులో కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసిన  సంగతి తెలిసిందే కదా. ఈ వెబ్ సిరీస్‌లో  రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్‌, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించింది.

ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ వాజ్‌పేయ్ తో పాటు సమంత పాత్ర కూడా అదే రీతిలో హైలెట్‌గా నిలిచింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ మరో అరుదైన రికార్డు నమోదు చేసింది.  ప్రపంచంలో అత్యుత్తమ వెబ్ సిరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చోటు సంపాదించుకుంది. ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ నాల్గో ప్లేస్‌లోIMDBలో ఈ సినిమా 10కి 8.8 పాయింట్లు సాధించింది.  హాలీవుడ్‌కు చెందిన ‘లోకీ’, ‘స్వీట్ టూత్’, ‘మేర్ ఈస్ట్ టౌన్’ తొలి మూడు స్థానల్లో నిలిచింది. ఈ సందర్భంగా ఈ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ విషయానికొస్తే.. ఇందులో సమంత అక్కినేని, మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి ముఖ్యపాత్రల్లో నటించారు. సమంత ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఆమె తమిళంలో ‘కాతు వాకుల2 ‘రెండు కాదల్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో  పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో కూడా నటిస్తున్నారు.

First published:

Tags: Bollywood news, Samantha akkineni, The family man 2, Tollywood

ఉత్తమ కథలు