Samantha : నక్క తోక తొక్కిన సమంత.. ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో అక్కినేని మాజీ కోడలు..

సమంత (Samantha Photo : Instagram)

Samantha : నక్క తోక తొక్కిన సమంత.. ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో అక్కినేని మాజీ కోడలు.. వివరాల్లోకి వెళితే.. తాజాగా సమంత.. బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లో

  • Share this:
    Samantha : నక్క తోక తొక్కిన సమంత.. ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో అక్కినేని మాజీ కోడలు.. వివరాల్లోకి వెళితే.. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.  పెళ్లై నాలుగో వివాహా వార్షికోత్సవం జరుపుకుంటారనున్న అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చి వీళ్లిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు.  తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఏ క్షణమైతే ఆమె నాగచైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

    పెళ్లి తర్వాత సమంత బాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయింది అంతేకాదు ఒకేసారి రెండు సినిమాలు చేస్తన్నట్టు ప్రకటించింది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    మరోవైపు సమంత, నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేయనుంది. తాజాగా ఈ భామకు బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్‌, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ  సినిమాలో ముందుగా నయనతారను అనుకున్నా.. ఫైనల్‌గా సమంతను ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు చేరువైన సమంత.. ఈ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఈ సినిమాకు ‘లయన్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియమణి నటిస్తోంది. ఈ సినిమా కోసం సమంతకు రూ. 7 కోట్ల వరకు పారితోషకం ఆఫర్ చేసినట్టు సమాచారం.

    సమంత, షారుఖ్ ఖాన్ (Twitter/Photo)


    సమంత విషయానికొస్తే..  దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరుగా నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిరుచులను, సంఘటనలను షేర్ చేసుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు సమంత. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్మ్‌ ఫామ్‌ లో కొద్ది రోజుల వరకు మొదటి స్థానంలో ఉన్న కాజల్ అగర్వాల్ ను వెనక్కి నెట్టి సమంత నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

    Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    రీసెంట్‌గా సమంత.. ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ లిస్టులో సమంత నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, రష్మిక ఉన్నారు. విడాకుల తర్వాత కూడా ఆమె మొదటి స్థానం దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయమే. చూడాలి మరి ఆ స్థానం ఎంతకాలం కొనసాగుతుందో.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: