నాగ చైతన్య కోసం ఆన్‌లైన్‌లో ఆ పాఠాలు నేర్చుకుంటున్న సమంత..

అవును సమంత ఇపుడు తన భర్త నాగ చైతన్య కోసం ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: June 9, 2020, 11:18 AM IST
నాగ చైతన్య కోసం ఆన్‌లైన్‌లో ఆ పాఠాలు నేర్చుకుంటున్న సమంత..
తాను పిల్లలను కంటే సినిమాలకు దూరం అయిపోతానని ఇప్పటికే చెప్పేసింది సమంత. అయితే అదెప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ సమంత కాంటెస్ట్‌లో ఒకరు ఇదే ప్రశ్న అడిగాడు.
  • Share this:
అవును సమంత ఇపుడు తన భర్త నాగ చైతన్య కోసం ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. సమంత అక్కినేని .. పెళ్లి తర్వాత కూడా వరస హిట్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సమంత.. ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు..కుక్కతో ఆడుకుంటోంది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటికే భర్తతో షికారుకు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న సమంత.. రీసెంట్‌గా తన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మార్క్స్ షీట్‌ను అభిమానులతో పంచుకుంది. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో సమంత.. ఇంట్లో ఉన్న టెర్రస్ పై ఇంటికి కావాల్సిన కూరగాయలను పండిస్తోంది. అది కూడా పూర్తిగా సేంద్రియా పద్దతులతో పండిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక సమంత ఎన్ని వచ్చినా.. వంట మాత్రం రాదు. వీళ్ల ఇంట్లోకూడా నాగ చైతన్యనే సమంత కోసం గరిట తిప్పుతున్నాడు.

సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)


ఇప్పటికే  చైతూ చేసి వివిధ వంటలను సమంత సోషల్ మీడియాలో అభిమానులకు చెప్పిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సమంత.. ఆన్‌లైన్‌లో వంట తరగతులకు హాజరైంది. అంతేకాదు కేవలం కొన్ని రోజుల్లోనే వంటలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది.  అంతేకాదు ఇపుడు ఏకంగా తన భర్త నాగచైతన్యకు వంట చేసి పెడుతోంది. మొత్తంగా ఇన్ని రోజులు.. చైతూ చేతి తిండి తిన్న సమంత.. ఇపుడు తన హబ్బికి వంట చేసి పెడుతుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 9, 2020, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading