Home /News /movies /

SAMANTHA AKKINENI LEARNS ANIMAL FLOW WORKOUTS SHARES VIDEO MNJ

Samantha Akkineni: వామ్మో..ఒళ్లును విల్లులా విరిచేస్తున్న అక్కినేని ఇంటి కోడలు... సమంత ఫిట్‌నెస్ లెవ‌ల్ చూశారా

సమంత అక్కినేని Photo :  Instagram

సమంత అక్కినేని Photo : Instagram

స‌మంత అక్కినేని(Samantha Akkineni) అంటే యాక్టింగ్ ఒక్కటే కాదు.. స్టైలింగ్, ఫిట్‌నెస్‌కి పెట్టిన పేరు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివ‌ర‌కు ఫిట్‌నెస్‌కి చాలా ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ వ‌స్తున్నారు స‌మంత‌. ఇక ఫిట్‌గా ఉండ‌టం కోసం కేవ‌లం ఆహారం విష‌యంలోనే కాదు శారీర‌క క‌ష్టం కూడా ప‌డుతుంటారు.

ఇంకా చదవండి ...
    Samantha Akkineni: స‌మంత అక్కినేని అంటే యాక్టింగ్ ఒక్కటే కాదు.. స్టైలింగ్, ఫిట్‌నెస్‌కి పెట్టిన పేరు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివ‌ర‌కు ఫిట్‌నెస్‌కి చాలా ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ వ‌స్తున్నారు స‌మంత‌. ఇక ఫిట్‌గా ఉండ‌టం కోసం కేవ‌లం ఆహారం విష‌యంలోనే కాదు శారీర‌క క‌ష్టం కూడా ప‌డుతుంటారు. ఒక‌ప్పుడు జిమ్‌లో బాగా వ‌ర్కౌట్లు చేసే స‌మంత‌.. అప్ప‌ట్లో వంద కేజీల బ‌రువు గ‌ల ఒక ప‌రిక‌రాన్ని పైకెత్తి వాహ్వా అనిపించింది. అంతేనా ఆ త‌రువాత కూడా క‌ష్ట‌మైన ఎన్నో జిమ్‌ల‌ను ఆమె చేసింది. ఇక లాక్‌డౌన్ స‌మ‌యంలో యోగాపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. యోగాసనాల‌తోనూ మెప్పించారు. క్లిష్ట‌మైన ఆస‌నాల‌ను సైతం కొన్నింటిని నేర్చుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్‌కి గుర‌య్యారు. ఇదిలా ఉంటే ఈ సంవ‌త్సరం మ‌రో కొత్త వ‌ర్కౌట్ల‌ను ప్రారంభించింది స‌మంత‌.

    ఎనిమ‌ల్ ఫ్లో అనే వ‌ర్కౌట్ల‌ను ఆమె చేయ‌డం సమంత ప్రారంభించింది. దానికి సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్న అక్కినేని వారి కోడ‌లు.. కొత్త సంవ‌త్స‌రం, కొత్త హాబీ, లెట్స్ డ్యాన్స్ అని కామెంట్ పెట్టింది. ఆ వీడియోలో ఒళ్లును విల్లులా విరిచేస్తుంది స‌మంత‌. ఇక ఈ వీడియోలో స‌మంతతో పాటు ట్రైన‌ర్ ఉన్నారు.




    కాగా ఇక స‌మంత కెరీర్‌లోకి వెళ్తే.. ఆహా ఓటీటీ కోసం ఆమె హోస్ట్‌గా చేసిన సామ్ జామ్ మొద‌టి సీజ‌న్ త్వ‌ర‌లో పూర్తి కానుంది. లాస్ట్ ఎపిసోడ్‌లో త‌న భ‌ర్త నాగ చైత‌న్య‌ను ఇంట‌ర్వ్యూ చేసింది స‌మంత. ఇక ఈ న‌టి తమిళ్‌లో కాటువాకులా రెండు కాదల్ అనే మూవీలో న‌టిస్తోంది స‌మంత‌. ఇందులో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తుండ‌గా.. న‌య‌న‌తార, స‌మంత‌ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు. అలాగే అశ్విన్ శ‌రవ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో స‌మంత నటిస్తోంది. ఇక తెలుగులో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన పీరియాడిక్ చిత్రం శాకుంత‌లంలో స‌మంత న‌టించ‌నుంది. వీటితో పాటు ఆమె విల‌న్‌గా న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ వ‌చ్చే నెల‌లో అమెజాన్‌లో విడుద‌ల కానుంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Samantha, Samantha akkineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు