• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMANTHA AKKINENI KAJAL AGGARWAL KEERTHY SURESH TOP 3 HOTTEST SOUTH INDIAN ACTRESSES WITH THEIR BEST ETHNIC LOOKS MNJ GH

Samantha Akkineni- Kajal Aggarwal- Keerthy Suresh: సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటున్న దక్షిణాది తారలు.. ఈ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!

Samantha Akkineni- Kajal Aggarwal- Keerthy Suresh: సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటున్న దక్షిణాది తారలు.. ఈ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!

కాజల్ సమంత కీర్తి సురేష్

Samantha Akkineni- Kajal Aggarwal- Keerthy Suresh: మన హీరోయిన్స్ రోజంతా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్డేట్స్ పోస్ట్ చేయడానికి మాత్రం సమయం కేటాయిస్తారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు.. తాజాగా దక్షిణాది పరిశ్రమకు చెందిన టాప్ హీరోయిన్స్ సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ లుక్స్లో దర్శనమిచ్చారు.

  • Share this:
Samantha Akkineni- Kajal Aggarwal- Keerthy Suresh: మన హీరోయిన్స్ రోజంతా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్డేట్స్ పోస్ట్ చేయడానికి మాత్రం సమయం కేటాయిస్తారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు.. తాజాగా దక్షిణాది పరిశ్రమకు చెందిన టాప్ హీరోయిన్స్ సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ లుక్స్లో దర్శనమిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో టాప్ హీరోయిన్స్ అంతా రొటీన్కు భిన్నంగా శారీలో తలుక్కుమంటున్నారు. ఎప్పుడో వాడేసి పాతబడిపోయిన ఎన్నో ఫ్యాషన్లు ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. ఎప్పుడో పాత సినిమాల్లో చూసిన ప్రేక్షకులకు మరోసారి శారీ అందాలను రుచి చూపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులను దరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. ప్రస్తుతం వీరు శారీలో తలుక్కుమన్న ఫోటోలపై ఓలుక్కేద్దాం.

ఎరుపు రంగు శారీలో మెరిసిపోయిన కాజల్..

చందమామ కాజల్ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్తో ఇండియన్–2, మంచు విష్ణుతో మోసగాళ్లు చిత్రాలతో పాటు బాలీవుడ్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ట్రెండీ లుక్తో దర్శనమిచ్చింది. ఎరుపు రంగు శారీ, పసుపు, నారింజ రంగు చుడీదార్ వేర్లో కుర్రాళ్ల మతి పోగోడుతుంది ఈ చిన్నది.










చీరకట్టులో తళుక్కుమన్న సామ్..

పెళ్లి తర్వాత కూడా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్సిరీస్లు.. ఇంకోవైపు హోస్ట్గా వ్యవహరిస్తూ ఈ చిన్నది ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అక్కినేని వారి కోడలు సాంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లూ, గోల్డెన్ కలర్ శారీ లుక్లో మెరిసిపోయింది. మరోవైపు గ్రీన్ కలర్ చుడీదార్లో చిరునవ్వు చిందిస్తూ తళుక్కుమంది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారాయి.










చబ్బీ లుక్స్తో కీర్తి సురేష్

తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఉత్తమ నటి అవార్డు గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకుంది. ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సర్కారు వాటి పాట చిత్రంలో నటిస్తోంది. పరుశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. తాజాగా, ఈ అమ్మడు కొత్త లుక్లో దర్శనమిచ్చింది. లైట్ గోల్డెన్ కలర్ శారీ లుక్లో చబ్బీ చబ్బీగా కనిపిస్తూ ఫోటో షూట్లో పాల్గొంది. మరి ఈ స్టిల్స్ కేవలం ఫోటో షూట్ కోసమేనా? లేక మహేష్ సినిమా కోసమా? అనేది ఆసక్తికరంగా మారింది.








మొత్తానికి చీరల్లో మరింత సంప్రదాయంగా ఉంటూ అభిమానులకు ఆకట్టుకుంటున్నారు ఇప్పటి హీరోయిన్లు.
Published by:Manjula S
First published:

అగ్ర కథనాలు