సమంత అక్కినేని చాలా డేంజర్ అంటున్న కుర్ర హీరో..

Samantha Akkineni: తెలుగులో సమంత అక్కినేనికి ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉండొచ్చు.. సినిమాకు కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ ఈమె.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 3, 2020, 6:06 PM IST
సమంత అక్కినేని చాలా డేంజర్ అంటున్న కుర్ర హీరో..
ఎర్ర చీరలో సమంత అక్కినేనిని చూడతరమా (Instagram/Photo)
  • Share this:
తెలుగులో సమంత అక్కినేని(Samantha Akkineni)కి ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉండొచ్చు.. సినిమాకు కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ ఈమె. ఇప్పటికీ సమంత(Samantha Akkineni) ఊ అనాలే కానీ కథలు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు దర్శకులు. ప్రస్తుతం శర్వానంద్‌(Sharwanand)తో ఈమె నటించిన జాను(Jaanu) సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సమంతపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు శర్వానంద్. సమంత చాలా డేంజర్ బాబోయ్.. ఆమెతో నటించడం అంటే చిన్న విషయం కాదంటూ కామెంట్ చేసాడు.

సమంత అక్కినేని జాను సినిమా ట్రైలర్ (Jaanu movie)
సమంత అక్కినేని జాను సినిమా ట్రైలర్ (Jaanu movie)


ముఖ్యంగా స్క్రీన్ పై ఆమెతో నటిస్తే మొత్తం తనే తినేస్తుంది.. జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మనం కనిపించం అంటూ చెప్పుకొచ్చాడు శర్వా. సాయి పల్లవి, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు కూడా అంతే అని.. అందులోనే సమంత కూడా వస్తుందని చెప్పాడు శర్వా((Sharwanand)). వాళ్లతో నటించాలని దర్శకుడు చెప్పినపుడే ప్రిపేర్ అయిపోవాలని.. వాళ్ల రేంజ్‌లో కాకపోయినా కాస్తైన బాగా నటించాలి కదా అంటూ కామెడీ చేసాడు శర్వానంద్. కచ్చితంగా జాను సినిమాలో కూడా సమంతతో పోటీ పడి నటించాననే అనుకుంటున్నానని.. రేపు సినిమా విడుదలైన తర్వాత ఏదైనా పేరు వస్తే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వాల్సిందే అంటున్నాడు శర్వా. ఏదేమైనా కూడా సమంత లాంటి హీరోయిన్లు చాలా డేంజర్ అబ్బా అంటూ సరదాగా మాట్లాడాడు ఈ కుర్ర హీరో.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు