SAMANTHA AKKINENI IS GOING TO BE SMALL PART OF AKHIL NEW MOVIE DIRECTED BY BOMMARILLU BHASKAR PK
సమంత అక్కినేని.. అప్పుడు నాగార్జున కోసం.. ఇప్పుడు అఖిల్ కోసం..
ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సమంత అక్కినేని అతిథి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.
అక్కినేని కుటుంబం కలిసి నటించడం కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు వాళ్లు కథ కలిసొస్తే చాలు కలిసి నటిస్తూనే ఉంటారు. ఇప్పటికే అంతా కలిసి నటించిన మనం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అక్కినేని కుటుంబం కలిసి నటించడం కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు వాళ్లు కథ కలిసొస్తే చాలు కలిసి నటిస్తూనే ఉంటారు. ఇప్పటికే అంతా కలిసి నటించిన మనం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాలో మనం అనేది ఓ సంచలనం. ఇక ఈ సినిమాతో పాటు నాగార్జున, నాగ చైతన్య కూడా కలిసి నటించారు. ఇక ఇప్పుడు అక్కినేని అభిమానులకు మరో తీపి కబురు కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. అఖిల్ నాలుగో సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది.
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్న అఖిల్.. ఈ సినిమాలో పూజా హెగ్డేతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సమంత అక్కినేని అతిథి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున మన్మథుడు 2లో రెండు నిమిషాలు కనిపించి మాయమయ్యే పాత్ర చేసింది సమంత. ఇక ఇప్పుడు మరిది అఖిల్ కోసం కూడా అతిథిగా మారబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అఖిల్, పూజా (Source: Twitter)
బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ తన కథను మొదట్లో ఓ లేడీ స్కూటి ఎక్కి చెబుతూ ఉంటాడు కదా.. అలాగే ఈ చిత్రంలో కూడా అఖిల్ తన కథను సమంతకు చెప్తాడని ప్రచారం జరుగుతుంది. ఆమె కోణంలోనే సినిమా మొదలవుతుందని.. భాస్కర్ అలా డిజైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. 2020 సమ్మర్ కానుకగా అఖిల్ సినిమా విడుదల కానుంది. మరి సమంత, అఖిల్ కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.