‘మన్మథుడు 2’ విషయంలో సమంత అక్కినేని చెప్పిందే నిజమైందా..

మన్మథుడు 2 సినిమా విడుదలైంది.. నాగార్జున అభిమానులు ఈ చిత్రం చూసి తమ హీరో కొత్తగా ఉన్నాడని పండగ చేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి పాత్ర ఇది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 9, 2019, 2:06 PM IST
‘మన్మథుడు 2’ విషయంలో సమంత అక్కినేని చెప్పిందే నిజమైందా..
మన్మథుడు 2 షూటింగ్ పిక్
  • Share this:
మన్మథుడు 2 సినిమా విడుదలైంది.. నాగార్జున అభిమానులు ఈ చిత్రం చూసి తమ హీరో కొత్తగా ఉన్నాడని పండగ చేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి పాత్ర ఇది. ఇలాంటి కారెక్టర్ చేయాలంటే ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో నాగార్జున తప్ప మరో ఆప్షన్ లేదు. అయితే ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి సినిమా ఇప్పుడు నాగ్ చేయడం కాస్త అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా జీర్ణించుకోవడం కష్టమే. ఎంతైనా 60 ఏళ్ళ వయసులో అలా రొమాన్స్ చేయడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది ఆడియన్స్‌కు.
Samantha Akkineni interesting comments on Manmadhudu 2 movie and Nagarjuna opens about it pk  మన్మథుడు 2 సినిమా విడుదలైంది.. నాగార్జున అభిమానులు ఈ చిత్రం చూసి తమ హీరో కొత్తగా ఉన్నాడని పండగ చేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి పాత్ర ఇది. samantha,samantha akkineni,nagarjuna akkineni,nagarjuna akkineni manmadhudu 2,manmadhudu 2 movie review,manmadhudu 2 review,samantha akkineni twitter,telugu cinema,manmadhudu 2 movie updates,మన్మథుడు 2,నాగార్జున అక్కినేని,సమంత అక్కినేని,నాగార్జున సమంత,తెలుగు సినిమా
సమంత ఫైల్ ఫోటోస్

ఇదిలా ఉంటే ఈ విషయాన్ని అందరికంటే ముందు చెప్పింది సమంత అక్కినేని. అవును.. కోడలికి నిజంగానే ఈ చిత్రంపై నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఈ విషయాన్ని చెప్పింది కూడా హీరో నాగార్జునే. తన కోడలు సమంతకు మన్మథుడు 2 ట్రైలర్ నచ్చలేదని చెప్పాడు ఈయన. ముందు ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఏంటిది ఇలా ఉంది.. మా మామను ఇలా నేను చూడలేనని అరిచేసిందని చెప్పాడు నాగార్జున. ఇప్పుడు ఆమె అభిప్రాయమే నిజమైందని అర్థమవుతుంది.

Samantha Akkineni interesting comments on Manmadhudu 2 movie and Nagarjuna opens about it pk  మన్మథుడు 2 సినిమా విడుదలైంది.. నాగార్జున అభిమానులు ఈ చిత్రం చూసి తమ హీరో కొత్తగా ఉన్నాడని పండగ చేసుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి పాత్ర ఇది. samantha,samantha akkineni,nagarjuna akkineni,nagarjuna akkineni manmadhudu 2,manmadhudu 2 movie review,manmadhudu 2 review,samantha akkineni twitter,telugu cinema,manmadhudu 2 movie updates,మన్మథుడు 2,నాగార్జున అక్కినేని,సమంత అక్కినేని,నాగార్జున సమంత,తెలుగు సినిమా
నాగార్జున, సమంత ఫైల్ ఫోటో

మన్మథుడు 2 సినిమాకు టాక్ ఊహించినంతగా అయితే లేదు. కొత్తగా ఉంది.. నాగార్జున బాగున్నాడు.. అక్కడక్కడా కామెడీ సీన్స్ బాగున్నాయి అంటున్నారే కానీ సూపర్ అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. పైగా అప్పుడు మన్మథుడికి త్రివిక్రమ్ పంచ్ డైలాగులు ప్రాణం. కానీ ఇప్పుడు మన్మథుడు 2లో మాత్రం అవి కనిపించలేదు.. అదే సినిమాకు మైనస్ అయింది కూడా. పైగా కథ కూడా రొటీన్‌గా ఉండటం.. రొమాన్స్ శృతి మించడంతో సమంత అక్కినేని చెప్పినట్లుగానే జరుగుతుందా అని భయపడుతున్నారు ఫ్యాన్స్.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు