హోమ్ /వార్తలు /సినిమా /

సమంత ఎంత అందమో తన మనస్సు కూడా అంతే అందం..

సమంత ఎంత అందమో తన మనస్సు కూడా అంతే అందం..

సమంత Photo : Instagram

సమంత Photo : Instagram

Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై ఇక అప్పటినుండి తన అందమైన మనస్సుతో ప్రేక్షకుల హృదయాలను తన మాయలో పడేస్తూనే ఉంది.

Samantha : సమంత ఎంత అందమో తన మనస్సు కూడా అంతే అందం. తన అసిస్టెంట్‌కు సంబందించిన ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చి.. తన మనసును చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని ‘‘ఆర్య (సమంత అసిస్టెంట్) నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. ‘ఏమాయ చేసావె’ చివరి షెడ్యూల్‌ నుంచి నా అసిస్టెంట్‌. పదకొండేళ్లుగా నాతోనే ఉన్నాడు. చలిలో గానీ ఎండ గానీలో, బాధ సంతోషంలో గానీ.. నాతోనే ఉన్నాడు. అంతేకాదు నన్ను మా అమ్మానాన్న కంటే బాగా చూసుకున్నాడు. నా దగ్గర ఉంటూనే తను ఈ రెస్టారెంట్‌ నడుపుతున్నాడు. ఆర్య విజయం సాధించాలనీ కోరుకుంటున్నా’’ అని తెలిపింది. సమంత 'ప్రత్యూష సపోర్ట్' అనే ఓ ఎన్ జి ఓ ను నడుపుతూ అక్కడ బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావాల్సిన వైద్య, విద్య ఖర్చులను భరిస్తూ చాలా కుటుంబాలకు సాయంగా నిలబడింది. తన వంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇలాంటీ మనస్సు, ఈ సామాజిక సృహా మనం అందరిలో (హీరోయిన్స్‌) చూడలేం.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. అలా పోయిన సంవత్సరం సమంత అదరగొట్టిన ఈ సంవత్సరంలో సమంత మొదటి సినిమా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పొచ్చు. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అది అలా ఉంటే సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు సమంత ఆ సినిమా నుండి తప్పుకుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఈ సినిమా కాకుండా సమంత మరో తమిళ ప్రాజెక్ట్‌ని ఒకే చేసింది. హీరోయిన్ స్నేహ భర్త నటుడు ప్రసన్న సరసన ఓ మూవీలో హీరోయిన్‌గా సమంత నటించనుంది. ఈ చిత్రానికి కూడా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగుతుంది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది. అది అలా ఉంటే సమంత ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమాను ఓకే చేసినట్లు లేదు. మరీ కావాలనీ తెలుగు సినిమాలను దూరం పెడుతోందా.. లేక సరైన కథ కోసం ఎదురుచూస్తోందా, 'జాను' ఫలితం ఎఫెక్టా తెలియదు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: Samantha akkineni, Womens Day 2020

ఉత్తమ కథలు