SAMANTHA AKKINENI HURTED BY THE WAY OF FILMFARE AWARDS AND SHE CANT EVEN GET SINGLE AWARD PK
సమంత అక్కినేనికి ఆ విషయంలో అన్యాయం జరిగిందా..?
Instagram.com/samantharuthprabhuoffl/
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఫ్యాన్స్ బాగా ఫైర్ అయిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే ఫిల్మ్ ఫేర్ అవార్డుల విషయంలో సమంత ఫ్యాన్స్..
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఫ్యాన్స్ బాగా ఫైర్ అయిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే ఫిల్మ్ ఫేర్ అవార్డుల విషయంలో సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు బాగా హర్ట్ అయ్యారు. 2018లో దాదాపు అరడజన్ సినిమాలు చేసింది స్యామ్. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. పైగా పెళ్లి తర్వాత కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని ఎంచుకుంటుంది సమంత. 2018లో 'రంగస్థలం', 'మహానటి', 'యూ టర్న్', 'అభిమన్యుడు' వంటి మంచి సినిమాలు చేసింది సమంత.
‘రంగస్థలం’లో రామలక్ష్మి
ఈ సినిమాలన్నింటిలోనూ సమంత పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా 'రంగస్థలం'లో రామలక్ష్మి పాత్ర అయితే అద్బుతమే. ఇక 'మహానటి'లో మధురవాణి కూడా మంచి పాత్రే. ఈ రెండు సినిమాలకు తాజాగా ఏకంగా 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. వీటిలో సమంత పాత్ర కూడా బాగానే ఉన్నా కూడా కనీసం ఒక్క అవార్డు కూడా సమంతక రాలేదు. దాంతో పాటు మిగిలిన సినిమాలు కూడా అవార్డులకు నోచుకోలేదు. దీంతో సమంత అభిమానులు నిరాశపడుతున్నారు. ఎందుకంటే యూ టర్న్, సూపర్ డీలక్స్ లాంటి సినిమాల్లో కూడా స్యామ్ నటనకు మంచి స్పందన వచ్చింది. అయినా కూడా ఒక్క అవార్డు కూడా రాలేదు.
సమంత(Instagram/samantharuthprabhuoffl)
ఒకే ఏడాది అన్ని సినిమాలు చేసినా కూడా కనీసం ఒక్క సినిమాలో కూడా అవార్డు నటన చేయలేదా అంటూ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో సమంత కూడా హర్ట్ అయిందని తెలుస్తుంది. ఈ ఏడాది కూడా మజిలీ, ఓ బేబీ సినిమాలు చేసింది. మన్మథుడు 2లో గెస్ట్ రోల్ చేసింది సమంత. దాంతోపాటే 96 రీమేక్‌లో కూడా నటిస్తుంది అక్కినేని కోడలు. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలోనే నటిస్తుంది స్యామ్. మరి 2019లో నటించిన సినిమాలకైనా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వస్తాయో రావో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.