హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: సమంత వర్కౌట్స్ చూడతరమా.. తన పెంపుడు కుక్కతో కలిసి సామ్ జామ్..

Samantha: సమంత వర్కౌట్స్ చూడతరమా.. తన పెంపుడు కుక్కతో కలిసి సామ్ జామ్..

సమంత వర్కౌట్స్ (Instagram/Photo)

సమంత వర్కౌట్స్ (Instagram/Photo)

Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. తాజాగా సమంత

  Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  మరోవైపు సమంత.. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం సామ్ జామ్ అనే షో చేస్తోంది. ఈ షోలో సమంత.. సెలబ్రిటీలను వెరైటీగా ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి వాళ్లను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది.

  Samantha Akkineni Hot Work outs Video with her pet go viral On Social Media,Samantha,Samantha Work outs,Samantha Akkineni enjoys maldives vacation,Samantha Akkineni samantha gym workout pic, akkineni, samantha instagram, samantha bigg boss telugu,samantha akkineni bigg boss 4 telugu,సమంత అక్కినేని, samantha akkineni news, samantha akkineni films,సమంత,సమంత వర్కౌట్స్,సమంత చూడతరమా
  సమంత వర్కౌట్స్ (Instagram/Photo)

  అది అలా ఉంటే సమంత ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేసింది. అంతేకాదు అక్కడ తనకు నచ్చిన ఫుడ్‌ను ఎలాంటి లిమిట్స్ లేకుండా ఆరగించిందట.దీంతో మాల్దీవుల నుంచి రాగానే తిరిగి వర్కౌట్స్ మొదలుపెట్టింది.  ఓ నిపుణుడి పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తోంది.  దానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Samantha akkineni, Tollywood

  ఉత్తమ కథలు