Samantha Akkineni: సమంత కొత్త ఇన్నింగ్స్.. మామ బాటలో యాంకర్‌ అవతారం ఎత్తిన సమంత..

సమంత ‘సామ్ జామ్’ (Twitter/Photo)

Samantha Akkineni | అక్కినేని కోడలు సమంత  దూకుడు మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు..మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా సమంత యాంకర్ అవతారం ఎత్తింది.

 • Share this:
  Samantha Akkineni | అక్కినేని కోడలు సమంత  దూకుడు మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు..మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత  సక్సెస్ రేటు కూడా పెరిగింది. గతేడాది  భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ అందుకుంది సమంత. ఆ తర్వాత ‘ఓ బేబి’ తో సోలో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. ఈ రకంగా అక్కినేని హీరోలు సక్సెస్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం హిట్స్ మీద హిట్స్ అందుకుంటుంది. మరోవైపు తన స్నేహితురాల్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. అంతేకాదు రీసెంట్‌గా మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’  సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది.

  samantha akkineni,trp rating for dasara episode samantha bigg boss telugu,samantha akkineni bigg boss 4 telugu,సమంత అక్కినేని, బిగ్ బాస్ 4 తెలుగు, బిగ్ బాస్ 4 తెలుగు హోస్ట్
  సమంత Photo : Twitter


  హోస్ట్‌గా మామకు తగ్గ కోడలిగా సమంత అదరగొట్టింది. వచ్చిన తెలుగుతో ఎక్కడా తడబడకుండా సమంత ఆకట్టుకుంది. దసరా స్పెషల్‌గా వచ్చిన సమంత తన యాంకరింగ్‌తో శభాష్ అనిపించుకుంది. అంతేకాకుండా గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ కు మంచి టీఆర్పీనే వస్తుంది అంతా అనుకున్నారు. ఇప్పుడు అలా అనుకున్నట్టుగానే 11.4 గట్టి టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం తెగ సంబరపడిపోతుంది. తాజాగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో హోస్ట్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు హోస్ట్‌గా పలువురు సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలను చేయనుంది. ఈ షో నవంబర్ 13న దీపావళి కానుకగా ప్రీమియం కానుంది.


  ఈ షోలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, తమన్నా, రష్మిక, సైనా నెహ్వాల్ దంపతులను ఇంటర్వ్యూ చేయనుంది. సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఆ మధ్య శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: