సమంత అక్కినేని.. పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ఈమె. సౌత్ హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ క్లోజ్ అయినట్లే అనే ఆనవాయితీకి బ్రేక్ చెప్పింది సమంత. ఇక ఈ భామ ఫిట్ నెస్ విషయంలో కూడా ఎక్కడలేని శ్రద్ధ తీసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్‌లో ఫిగర్ మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు. సమంత కూడా ఇదే చేస్తుంది. ముఖ్యంగా కెరీర్‌లో అవకాశాలు రావాలంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. సమంత ఈ విషయంలో అందరి కంటే మూడు ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ఉంది కదా.. ఖాళీగా ఉన్నా కూడా ఛాన్సులు వస్తాయి.. ఇంత కష్టం ఎందుకు బాబోయ్ అని అంతా అంటున్నా కూడా తను మాత్రం వర్కవుట్ చేస్తూనే ఉంటుంది.
Samantha never leaves us surprised with her fitness motivation
@starframesofficial
Visit our website for HD pictures https://t.co/7dg9vjlq4u#100kg #deadlift Woow @samantharuthprabhuoffl #samantha #samanthaakkineni #samantharuthprabhu #samantharuth #janu #janutelugu pic.twitter.com/Ct3G1dOOwP
— Star Frames (@starframes4u) March 6, 2020
ఇప్పటికే జిమ్‌లో చెమటలు కక్కుతూనే ఉంటుంది స్యామ్. తాజాగా ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా 100 కేజీల బరువులు ఎత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మూడు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది సమంత. కష్టమైన వర్కౌట్స్ కూడా చాలా సింపుల్‌గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్ల కింద 100 కేజీలు లిఫ్ట్ చేసి ఔరా అనిపించిన సమంత.. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ చేసి చూపించింది. ఇప్పుడు సమంత ఎత్తిన 100 కేజీల లోడ్ చూసి బాపురే అంటున్నారు ఫ్యాన్స్. ఫిజికల్ ఫిట్ నెస్‌పై సమంతకు ఉన్న శ్రద్దను చూసి ముచ్చటేస్తుంది అంటున్నారు నెటిజన్స్. జాను తర్వాత ఇంకా సినిమాలేవీ కమిటవ్వలేదు సమంత. తమిళనాట విజయ్ సేతుపతి సినిమాలో కమిటైనా కూడా ఇప్పుడు తప్పుకుందని తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood