హోమ్ /వార్తలు /సినిమా /

Shaakuntalam : షూటింగ్ పూర్తి చేసుకున్న గుణశేఖర్ శాకుంతలం.. కన్నీటి వీడ్కోలు..

Shaakuntalam : షూటింగ్ పూర్తి చేసుకున్న గుణశేఖర్ శాకుంతలం.. కన్నీటి వీడ్కోలు..

’శాకుంతలం’ సినిమాలో సమంత (Twitter/Photo)

’శాకుంతలం’ సినిమాలో సమంత (Twitter/Photo)

Shaakuntalam : అక్కినేని సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతితెలిసిందే.

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతితెలిసిందే. కాగా ఈ సినిమా తాజాగా తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ వీడియోను కూడా పంచుకుంది. చిత్రబృందానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగం చెందారు దర్శక నిర్మాతలు. సినిమా షూటింగ్ పూర్తై సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. చిత్రబృందానికి దర్శకుడు గుణ శేఖర్ (Gunasekhar), చిత్ర నిర్మాత నీలిమా బహుమతులు అందచేశారు.  ఇక ఈ చిత్రానికి సంబంధించి సమంత ఇటీవలే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు గుణశేఖర్. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha akkineni )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.

ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు.

గుణ శేఖర్ శాకుంతలం కంటే ముందు హిరణ్య కశిప అనే ఓ భారీ సినిమాను ప్రకటించారు. ఆయన ఎప్పటినుండో ఈ సినిమాను తెరకెక్కించాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రకటించారు కూడా. పురాణాలలో శివ భక్తుడు ప్రహాల్లద, రాక్షస రాజు హిరణ్యకశిపుడు మధ్య జరిగే సన్నివేశాలతో గుణ శేఖర్ ఈ కథను అల్లుకున్నారు గుణ శేఖర్. ఐతే ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతున్నా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో గుణ శేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను మొదలు పెట్టి పూర్తి చేశారు. ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కవాతుల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.

First published:

Tags: Akkineni samantha, Tollywood news

ఉత్తమ కథలు