Samantha Akkineni Pooja Hegde Rashmika Mandanna | సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ పెళ్లైయిందంటే కెరీర్ దాదాపు సమాప్తం అయిపోయినట్టే. హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే అవకాశాలు తగ్గాయనే సంకేతాలు పంపినట్టే. ఇపుడు మాత్రం చాలా మంది హీరోయిన్లు.. పెళ్లి తర్వాత కూడా ఫిల్మీ కెరీర్ కొనసాగిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని ఇంటి కోడలైన సమంత. పెళ్లి తర్వాత కూడా ఈమె కెరీర్ జెడ్ స్పీడ్‌లా దూసుకుపోతుంది. అంతేకాదు యంగ్ బ్యూటీలైన పూజా, రష్మిక ఎంట్రీ ఇచ్చినా.. సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సమంత మరో ఘనతను దక్కించుకుంది. హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 జాబితాలో సమంత తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాల్లో రాణిస్తోన్న నలభై ఏళ్ల లోపు వయసు గల మహిళలను తీసుకొని ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో సమంత అందరికంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని మొదటిస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలించింది. మరో హీరోయిన్ రష్మిక మందన్న ఈ జాబితాలో 9వ ప్లేస్‌లో నిలవడం విశేషం.
అలాగే ఈ జాబితాలో ఇంటర్నేషనల్ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలస్తే.. రకుల్ 7వ ప్లేస్‌లో నిలిచింది. కాజల్ 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన శ్రీముఖి ఈ జాబితాలో 25వ స్థానంలో నిలవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Rashmika mandanna, Samantha akkineni, Telugu Cinema, Tollywood