Samantha Akkineni - Naga Chaitanya: చైతూ లేకుండానే సమంత గోవా టూర్.. అభిమానులకు హింట్స్ ఇచ్చేస్తుందా..?

సమంత గోవా టూర్ (Samantha goa tour)

Samantha Akkineni - Naga Chaitanya: సమంత చేసిన మరో పనితో అంతా షాక్ అయ్యారు. ఎప్పుడూ భర్తతో పాటే టూర్స్‌కు వెళ్లే అలవాటు ఉన్న సమంత (Samantha Akkineni - Naga Chaitanya).. ఈ సారి మాత్రం ఒంటరిగా వెళ్లిపోయింది. తోడుగా తన స్నేహితురాలు శిల్పా రెడ్డిని తీసుకెళ్లింది కానీ చైతూను మాత్రం వదిలేసింది.

  • Share this:
అసలే సమంత అక్కినేని, నాగ చైతన్యపై కొన్ని రోజులుగా టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా లేనిపోని వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అనేది దీని సారాంశం. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నారంటూ కొన్ని మీడియా సంస్థలలో వార్తలు బలంగానే వచ్చాయి. నేషనల్ మీడియా అయితే ఏకంగా చైతూ, సమంత పేర్లతో సహా విడాకుల వ్యవహారం గురించి రాసుకొచ్చింది. మన దగ్గర మాత్రం పేర్లు బయటపెట్టకుండా గాసిప్స్ మాదిరే రాసారు. అయితే ఇలాంటి సమయంలో సమంత చేసిన ఓ పని చూసి అభిమానులతో పాటు అంతా షాక్ అయ్యారు. నిజానికి అలా వార్తలు వస్తున్నపుడే.. నాగార్జునకు బర్త్ డే విషెస్ చాలా ప్రేమగా చెప్పింది సమంత. మామా.. నువ్వే నాకు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ అంటూ ప్రేమగా చెప్తూ ప్రేమగా ఎమోజీలు కూడా పోస్ట్ చేసింది. దాంతో అక్కినేని జంట బాగానే ఉన్నారులే.. ఎలాంటి గ్యాప్ రాలేదులే అంటూ అభిమానులు సర్దుకున్నారు. అయితే అంతలోనే నాగార్జున బర్త్ డే పార్టీలో మాత్రం మిస్ అయింది సమంత. కుటుంబం అంతా కలిసి చేసుకున్న ఈ పార్టీలో అక్కినేని కోడలు మాత్రమే మిస్సింగ్.

చైతూ మాత్రం ఆ ఫోటోలలో నవ్వుతూ కనిపించాడు. మొహంలో ఎలాంటి కంగారు కానీ.. టెన్షన్ కానీ లేదంటున్నారు ఫ్యాన్స్. విడిపోతున్నారనే వార్తలు వస్తున్నా కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే.. అందులో ఎలాంటి నిజం లేదనే విషయం మీకు అర్థం కావడం లేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అక్కడున్న పార్టీలో నాగ చైతన్య, నాగార్జున, అఖిల్, అమలతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు. మరి అంతా బాగానే ఉంది.. సమంత ఎందుకు రాలేదు.. మామకు అంత ప్రేమగా విషెస్ చెప్పిన కోడలు.. పార్టీకి ఎందుకు రాలేదబ్బా అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఇక్కడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

Tollywood Drugs Case: ఈడీ ముందు పూరీ జగన్నాథ్.. మిగిలిన 11 మంది సినీ ప్రముఖులను విచారించే తేదీలు ఇవే..


కావాలనే సమంత రాలేదు.. విడిపోతున్నారు కాబట్టే నాగార్జున బర్త్ డేను లైట్ తీసుకుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు.. సమంత రాకపోవడానికి కారణం తమిళంలో విజయ్ సేతుపతి, విఘ్నేష్ శివన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తుండటమే అంటూ మరోవైపు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అక్కడ టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టే నాగార్జున బర్త్ డేకు రాలేదు తప్ప మరే ఇతర కారణాలు లేవంటున్నారు అభిమానులు.

Bigg Boss 5 Telugu final contestants list: మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 5 తెలుగు.. ఇదిగో కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్..


ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తాజాగా సమంత చేసిన మరో పనితో అంతా షాక్ అయ్యారు. ఎప్పుడూ భర్తతో పాటే టూర్స్‌కు వెళ్లే అలవాటు ఉన్న సమంత.. ఈ సారి మాత్రం ఒంటరిగా వెళ్లిపోయింది. తోడుగా తన స్నేహితురాలు శిల్పా రెడ్డిని తీసుకెళ్లింది కానీ చైతూను మాత్రం వదిలేసింది. పైగా గోవా టూర్ అంటే కచ్చితంగా పక్కనే చైతూ కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు మాత్రం సమంత అలాంటివేం లేకుండా.. నేరుగా ఒంటరిగా వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే సమంత సైలెంట్‌గా హింట్స్ ఇచ్చేస్తుందా అనే అనుమానాలు కూడా రాకపోలేదు.
Published by:Praveen Kumar Vadla
First published: