హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: అతడి డైరెక్షన్‌లో స‌మంత‌ అక్కినేని.. పెద్ద సాహ‌స‌మే చేస్తుందా

Samantha Akkineni: అతడి డైరెక్షన్‌లో స‌మంత‌ అక్కినేని.. పెద్ద సాహ‌స‌మే చేస్తుందా

సమంత అక్కినేని (Twitter/Photo)

సమంత అక్కినేని (Twitter/Photo)

Samantha Akkineni: పెళ్లైన త‌రువాత సినిమాలను కంటిన్యూ చేస్తోన్న సమంత‌.. ఇప్పుడు మ‌రో చిత్రానికి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. త‌న మొద‌టి హీరో ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు టాక్.

ఇంకా చదవండి ...

  Samantha Akkineni: పెళ్లైన త‌రువాత కూడా సినిమాల్లో జోరును కొనసాగిస్తున్నారు అక్కినేని కోడ‌లు స‌మంత‌. అయితే అంత‌కుముందులా క‌మ‌ర్షియ‌ల్ పాత్ర‌ల్లో కాకుండా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌కే ఆమె ఓకే చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఈ న‌టి గుణ‌శేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లంలో న‌టిస్తున్నారు. పౌరాణిక క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో స‌మంత కొత్త లుక్‌లో క‌నిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్య‌క్రమాలు ఇటీవ‌ల పూర్తి అయ్యాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇందులో స‌మంత శ‌కుంత‌ల‌గా, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంతుడిగా క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స‌మంత మ‌రో మూవీకి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించేందుకు స‌మంత ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

  లేడి ఓరియెంటెడ్ క‌థాంశంతో ఈ చిత్రం ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బ‌న్నీ వాసు నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు టాక్. కాగా రాహుల్, స‌మంత ఒకేసారి త‌మ సినిమా కెరీర్‌ని ప్రారంభించారు. వీరిద్ద‌రు మాస్కోవిన్ కావేరి అనే చిత్రంలో క‌లిసి న‌టించారు(కొన్ని కార‌ణాల వ‌ల‌న మూవీ విడుద‌ల ఆల‌స్య‌మైంది). అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్ర‌మంలోనే నాగార్జున‌తో రాహుల్ తెర‌కెక్కించిన మ‌న్మ‌ధుడు 2లో కెమెరా అప్పియ‌రెన్స్ ఇచ్చారు స‌మంత‌. ఇక రాహుల్ ర‌వీంద్ర భార్య, సింగ‌ర్ చిన్మ‌యి స‌మంత‌కు క్లోజ్ ఫ్రెండ్. స‌మంత కెరీర్ ప్రారంభం నుంచి ఆమె న‌టించిన ప‌లు పాత్ర‌ల‌కు చిన్మ‌యి త‌న గాత్రాన్ని ఇచ్చింది. వాటిని ప‌క్క‌న‌పెడితే రాహుల్ చెప్పిన క‌థ బావుండ‌టంతో స‌మంత ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అందుకే మన్మధుడు 2 ఫలితాన్ని ఆమె పట్టించుకోనట్లు సమాచారం.

  ఇదిలా ఉంటే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న స‌మంత న‌టించిన కాటువాకుల రెండు కాద‌ల్ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో స‌మంత నెగిటివ్ పాత్ర‌లో న‌టించారు. ఈ సిరీస్ కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Samantha akkineni

  ఉత్తమ కథలు