అక్కినేని కుటుంబంలో అంతా కలిసి మెలిసి ఉంటారు. నాగ చైతన్య, సమంత కలిసి వేరే ఇంట్లో ఉంటారు కానీ ప్రతీ ఆదివారం అక్కడ కలుసుకుంటారు. ఇప్పుడంటే లాక్ డౌన్ కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్లున్నారు కానీ నార్మల్ టైమ్‌లో అయితే వారానికోసారి కచ్చితంగా హాజరు వేసుకుంటారు. దాంతో పాటు మామ, అత్తలతో సమంత కూడా చాలా క్లోజ్‌గా ఉంటుంది. అమల అక్కినేని, నాగార్జునను అత్త మామలా కాకుండా స్నేహితుల్లా ట్రీట్ చేస్తుంటుంది సమంత. వాళ్లు కూడా అలాగే ఉంటారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మా కోడలు కు వంట రాదు.. కొడుకు చైతూ మాత్రం చక్కగా వంట చేసి పెడతాడంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా చెప్పాలంటే అక్కినేని వారింట ఆడవాళ్లు వంట రూమ్ వైపు వెళ్లరంటూ సెటైర్లు కూడా వేసింది. దాంతో అభిమానులు 'నువ్వు వంట చేయడం ఎందుకు నేర్చుకోలేదు' అంటూ సమంతను ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు. అత్తగారి మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకుందో లేదంటే సీరియస్‌గా తీసుకుందో తెలియదు కానీ సమంత మాత్రం ఇప్పుడు వంట చేసింది. చేసి అత్తకు తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. ముష్రుమ్ పాస్తాను సిద్ధం చేసి వంటలో తన పనితనాన్ని చూపించింది సమంత. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. చాలా రోజులుగా సోషల్ మీడియాలో కనిపించని సమంత ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. వస్తూ వస్తూనే అత్తకు షాక్ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amala Akkineni, Samantha akkineni, Telugu Cinema, Tollywood