మా ఆయన ఎంతందంగా ఉన్నాడో.. సమంత ఆనందం..

Samantha Naga Chaitanya: సమంత అక్కినేని సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో అప్ డేట్స్ పంచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా రానా దగ్గుబాటి రోకా ఫంక్షన్‌కు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 4:19 PM IST
మా ఆయన ఎంతందంగా ఉన్నాడో.. సమంత ఆనందం..
సమంత నాగ చైతన్య ()samantha naga chaitanya
  • Share this:
సమంత అక్కినేని సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో అప్ డేట్స్ పంచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా రానా దగ్గుబాటి రోకా ఫంక్షన్‌కు వెళ్లారు చైతూ సమంత దంపతులు. అక్కడే బంధువులతో చాలా సేపు ముచ్చటించారు. ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఈ వేడుకలో సమంత చాలా సంప్రదాయంగా కనిపించింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను తన ఇన్‌స్టా‌లో షేర్ చేసింది సమంత. అక్కడే రానా, మిహీకా దంపతులతో దగ్గుబాటి ఇప్పటి జనరేషన్‌ దిగిన ఫొటోను సమంత షేర్‌ చేసింది.


2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు థ్యాంక్స్‌ చెప్పింది సమంత. ఆ తర్వాత తన భర్త దగ్గరికి వచ్చింది. చైతూను ఆట పట్టిస్తూ పోస్ట్ చేసింది స్యామ్. అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌‌కు సమయం వచ్చింది.. చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా.. (భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు) అని ఫన్నీ పోస్ట్ చేసింది సమంత.

దీనిపై అంతే సరదాగా స్పందించాడు నాగ చైతన్య. చూస్తుంటే ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని చెప్పాడు చైతూ. అంతా కలిసి చేస్తున్న కుట్రలా ఉందే అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం చైతూ స్యామ్ రొమాన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading