కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఏదీ ఎక్కడా జరగడం లేదు.. పైగా కాలు తీసి ఇంటి బయటికి పెట్టే వీళ్లేదు. దాంతో ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు మన హీరోలు. కొందరు కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతుంటే.. మరికొందరు తమకు ఎంతో ఇష్టమైన పెట్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా తన సమయాన్ని పూర్తిగా కుటుంబంతోనే గడిపేస్తున్నాడు. భార్య సమంతతో పాటు తన పెట్స్‌ను కూడా అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది స్యామ్.
ఇప్పుడు కూడా ఇదే చేసింది. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో మరే పనేదీ లేని చైతూ.. హాయిగా తన కుక్కతో ఆడుకుంటున్నాడు. పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత. అందులో చైతూ నేలపై పడుకుంటే.. అతడిపై కుక్క పడుకుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేలపై పడుకుని ఉన్న చైతూను ఫోటో తీసి దీనికి 'క్వారంటీమ్' అనే క్యాప్షన్‌ను జత చేసింది సమంత.
సాధారణంగా క్వారెంటైన్ అంటే కరోనా వచ్చిన వాళ్లకు కదా.. మరి సమంత ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టింది.. కొంపదీసి చైతూకు కరోనా వచ్చిందా.. ఏంటిది స్యామ్ ప్లీజ్ తీసేయండి పోస్ట్ అంటూ అభిమానులు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం హ్యాపీ ఫ్యామిలీ టైమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు చైతూ. అందులో పరుశురామ్ సినిమా కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha, Telugu Cinema, Tollywood