హోమ్ /వార్తలు /సినిమా /

నాగార్జున దారిలో సమంత.. అక్కినేని కోడలా మజాకా..?

నాగార్జున దారిలో సమంత.. అక్కినేని కోడలా మజాకా..?

ఇప్పటికే నాగార్జున మన్మథుడు 2లో రెండు నిమిషాలు కనిపించి మాయమయ్యే పాత్ర చేసింది సమంత. ఇప్పుడు మరిది అఖిల్ కోసం కూడా అతిథిగా మారబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నాగార్జున మన్మథుడు 2లో రెండు నిమిషాలు కనిపించి మాయమయ్యే పాత్ర చేసింది సమంత. ఇప్పుడు మరిది అఖిల్ కోసం కూడా అతిథిగా మారబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Akkineni: పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సమంత అక్కినేని. ఇన్నాళ్లూ సినిమాలతోనే బిజీగా ఉన్న ఈమె..

పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సమంత అక్కినేని. పెద్దింటి కోడలు అయిన తర్వాత ఎంచుకునే కథల్లో కొత్తదనం చూపిస్తుంది. హూందా ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుంది సమంత అక్కినేని. ఈ ఏడాది ఇప్పటికే 96 రీమేక్ జాను సినిమాలో శర్వానంద్‌తో కలిసి జోడీ కట్టింది. అయితే తెలుగులో ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగు పెడుతుంది సమంత. తెలుగు దర్శక ద్వయం రాజ్ డికే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ 2లో నటిస్తుంది సమంత. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసింది. వీటితో పాటు మరిన్ని కథలు కూడా వింటుంది సమంత.

సమంత అక్కినేని (Samantha Akkineni)
సమంత అక్కినేని (Samantha Akkineni)

ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మరో కొత్త ఆలోచన కూడా చేస్తుంది. తాజాగా బిజినెస్ ఉమెన్ అయిపోవాలని ప్లానింగ్ సిద్ధం చేసుకుంటుంది అక్కినేని కోడలు. దీనికోసం స్కూలింగ్ బిజినెస్ ఎంచుకుంది స్యామ్. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మోహన్ బాబుతో పాటు మరికొందరు కూడా ఈ బిజినెస్‌లోనే ఉన్నారు. ఇప్పుడు సమంత కూడా ఇదే చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ప్రీ స్కూల్, నర్సరీ, ప్రైమరీ స్కూల్, పీపీ-2 స్కూళ్లను అత్యాధనునికంగా ఓపెన్ చేసింది సమంత. దానికోసం భారీగానే ఇన్వెస్ట్ చేయడానికి కూడా సిద్ధమవుతుంది ఈమె.

సమంత అక్కినేని (Samantha Akkineni)
సమంత అక్కినేని (Samantha Akkineni)

ఇప్పుడు ఎలాగూ సినిమాలు తగ్గించాలని అనుకుంటుంది సమంత. మంచి కథలు వస్తే కానీ చేయకూడదని ఫిక్సైపోయింది.. దానికి తోడు కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ ఇక వద్దనుకుంది. భర్త నాగ చైతన్యతో మంచి కథ వస్తే చేయడానికి ఎలాంటి సమస్యా లేదంటుంది సమంత. అందుకే సినిమాలకు ఫోకస్ తగ్గించి ఎంచక్కా స్కూల్ బిజినెస్ చేయాలని చూస్తుంది సమంత అక్కినేని. దీనికి ఏకం అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసింది సమంత. ఈ స్కూల్స్‌లో పిల్లలకు పర్యావరణంపై కూడా అవగాహన కల్పించనున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా శిక్షణ కూడా ఉంటుంది. ఆయా పిల్లల వయసును బట్టి వివిధ రకాల కోర్సులను ఇందులో కొత్తగా ప్రవేశ పెట్టాలని చూస్తుంది సమంత.

సమంత అక్కినేని (Samantha Akkineni)
సమంత అక్కినేని (Samantha Akkineni)

హైదరాబాద్‌లోనే ది బెస్ట్ స్కూల్స్‌గా దీన్ని మార్చాలని చూస్తుంది సమంత. దీనికోసం చైతూతో పాటు నాగార్జున సాయం కూడా తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బిజినెస్‌లో నాగార్జునను మించిన వాళ్లు టాలీవుడ్‌లో మరొకరు లేరు. ఇక ఇండస్ట్రీలో మంచు విష్ణు లాంటి వాళ్లు ఇప్పటికే అమెరికన్ ప్రీ ఎలిమెంటరీ స్కూల్స్ ప్రాంచైజీలను సొంతంగా నెలకొల్పాడు. అలాంటి వాళ్ల సాయం కూడా తీసుకోవాలని చూస్తుంది సమంత. జీవితా రాజశేఖర్‌తో పాటు సీనియర్ నటి రాశి కూడా స్కూల్ బిజినెస్ చేస్తున్నారు. మరి విద్య వ్యాపారంగా మారుతున్న సమయంలో సమంత వచ్చి ఏం చేస్తుందనేది చూడాలిక.

First published:

Tags: Nagarjuna, Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు