హోమ్ /వార్తలు /సినిమా /

Samantha - Naga Chaitanya: కోర్టులో తేల్చుకుంటా.. విడాకుల వివాదంపై సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha - Naga Chaitanya: కోర్టులో తేల్చుకుంటా.. విడాకుల వివాదంపై సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha - Naga Chaitanya

Samantha - Naga Chaitanya

Samantha - Naga Chaitanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సమంత తన పేరులో అక్కినేని తొలగించింది అని అంతేకాకుండా నాగచైతన్యను దూరం పెట్టిందని బాగా పుకార్లు వినిపించాయి.

ఇంకా చదవండి ...

  Samantha - Naga Chaitanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సమంత తన పేరులో అక్కినేని తొలగించింది అని అంతేకాకుండా నాగచైతన్యను దూరం పెట్టిందని బాగా పుకార్లు వినిపించాయి. ఇక ఇటీవలే సమంత తీర్థయాత్రలకు ఒంటరిగా ప్రయాణం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక తనతోపాటు నాగచైతన్య లేకపోయేసరికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటున్నారని అనుకున్నారు.

  వీరి విడాకుల గురించి ఇండస్ట్రీలో ఇంత హాట్ టాపిక్ గా మారిన కూడా అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి స్పందించలేదు. అంతేకాదు.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ సక్సెస్ అవ్వడంతో సక్సెస్ మీట్ పెట్టగా అక్కినేని నాగార్జున ఇంటా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి సమంత రాకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలవంతంగా చేకూరించింది.

  ఇది కూడా చదవండి:అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో సమంత మిస్సింగ్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసిందా?

  గత కొద్దిరోజుల నుంచి సమంత నాగచైతన్య పై వస్తున్న వార్తలు రోజురోజుకు అవి నిజమేనని బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటివరకు సాయి పల్లవి చైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనకపోవడం, నాగార్జున పుట్టినరోజు వేడుకలలో పాల్గొనకపోవడం, ఇక తాజాగా డిన్నర్ పార్టీలో కూడా సమంత లేకపోవడంతో వీరి గురించి వస్తున్న వార్తలపై మరిన్ని అనుమానాలను పెరుగుతున్నాయి.

  ఇది కూడా చదవండి: వీళ్ళు విడిపోతారని మూడేళ్ల ముందే చెప్పా.. సామ్, చైతు విడాకులపై వేణు స్వామి షాకింగ్ వీడియో?

  ఇలా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రోజురోజుకు వీరి గురించి వస్తున్న వార్తల వల్ల తనకు తన భర్త నాగచైతన్యకు పరువు నష్టం కలుగుతుందని,ఇప్పటికీ ఈ విషయంపై సైలెంట్ గా ఉంటే మరిన్ని దిగజారిన వార్తలు రాస్తారని ఈ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం సమంత కోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Love story, Naga Chaitanya, Samantha akkineni, Shekar kammula, Tollywood

  ఉత్తమ కథలు