సినిమా ఇండస్ట్రీలో కోల్డ్ వార్ అనే కామన్‌గా జరిగే విషయమే. అయితే స్టార్ హీరోల విషయంలోనే ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ ఉన్నప్పటికీ అవి అంతగా బయటపడేవి కావు. కానీ నయనతార, త్రిష మధ్య కోల్డ్‌వార్ ఫ్యాన్స్ గొడవల రూపంలో చాలా సార్లే బయటపడింది. తర్వాత ఇద్దరూ కలిసి పోయారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పటి హీరోయిన్స్ అలా కోల్డ్ వార్ జరిగిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే సమంత అక్కినేని, పూజా హెగ్డే. ఇద్దరూ అగ్ర కథానాయికలే. అయితే వీరి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది? మజిలీ సమయంలో సమంత పోస్ట్ చేసిన పోస్టర్‌ను రీపోస్ట్ చేస్తూ ఆమె అందంగా ఉందా? అని పూజా హెగ్డే తన సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో సామ్ అభిమానులు పూజా హెగ్డే మీద భగ్గుమన్నారు.
అయితే తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ పూజా హెగ్డే సర్ది చెప్పింది. అప్పటికి తాత్కాలికంగా గొడవ సద్దుమణిగినా.. సమంత ఫ్యాన్స సమయం కోసం వేచి చూడసాగారు. రీసెంట్గా సమంత ఫ్యాన్స్ హమ్మయ్య పూజా హెగ్డే బాగా జరిగింది.. తిక్క కుదిరింది అంటూ నవ్వుకుంటున్నారట. ఎందుకంటే రీసెంట్గా గుణశేఖర్ తన శాకుంతలం సినిమాలో హీరోయిన్గా సమంత అక్కినేని నటిస్తున్నట్లు ప్రకటించాడు.
అయితే అంత కంటే ముందు శాకుంతలంలో పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో దిల్‌రాజు ఫీల్డ్‌లోకి రావడంతో సమంత ఎంట్రీ జరిగింది. అలా పూజా హెగ్డే అవకాశాన్ని సమంత లాక్కుని దెబ్బ కొట్టిందంటూ సామ్ అభిమానులు సంతోషపడిపోతున్నారట మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Samantha akkineni, Tollywood