హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: ఇష్టసఖుడితో మాల్దీవ్స్ బీచుల్లో ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కినేని..

Samantha Akkineni: ఇష్టసఖుడితో మాల్దీవ్స్ బీచుల్లో ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కినేని..

 సమంత Photo : Instagram

సమంత Photo : Instagram

Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఈ భామ ప్రస్తుతం మాల్దీవ్స్ బీచుల్లో ప్రియమైనవాడితో ఎంజాయ్ చేస్తోంది.

    Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అది అలా ఉంటే సమంత ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భర్త నాగ చైతన్య ఈరోజు 34పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఈ జంట ప్రస్తుతం మాల్దీవ్స్‌లో సెలెబ్రేట్ చేసుకుంటుంది. అందులో భాగంగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. భార్య భర్తలు మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను సమంత పోస్ట్ చేసింది.


    ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా చేయాల్సీవుండగా.. ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. దీంతో సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ సినిమాతో పాటు సమంత కన్నడ సినిమా దియాను తెలుగులో రీమేక్‌ చేయనుందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. ఈ సినిమాపై కొంత క్లారిటీ రావాల్సీ వుంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Samantha akkineni

    ఉత్తమ కథలు