అభిమానులందు వీరాభినులు వేరయ అన్నట్టు.. తాజాగా అక్కినేని నాగ చైతన్యను చెందిన ఒక వీరాభిమాని చేసిన పనికి సమంత కన్నీరు పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగ చైతన్యకు సాగర్ అనే వీరాభిమాని ఉన్నాడు. సదరు ఫ్యాన్ ఈ నెల 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సింహాచలం ఆలయంలోని 1000 మెట్లను మోకాళ్లతో ఎక్కాడు. అంతేకాదు సదరు మెట్లు ఎక్కిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాన్ని చూసి అక్కినేని అభిమానులతో పాటు సమంత కూడా ఆశ్చర్యపోయింది. తన భర్త కోసం అభిమాని చేసిన పనికి మాటలు రావడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇలాంటి అభిమానులు ఉన్నందు వల్లే మేము ఈ స్థానాల్లో ఉన్నామంటూ కాస్త ఎమోషనల్ అయింది. అంతేకాదు సదరు అభిమానిని తమని వచ్చి కలవాలంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవితో ఒక సినిమా చేస్తున్నాడు.
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 24, 2019
Thankyou ... this is incredible .. speechless 🙏 please meet us 🙏🤗 https://t.co/zgy03ZLfft
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 24, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya Akkineni, Samantha akkineni, Telugu Cinema, Tollywood