అతడి బాడీ క్రేజీ.. యంగ్ హీరోపై సమంత అక్కినేని కామెంట్..

సమంత.. అక్కినేని ఇంటి కోడలు.. హీరో నాగచైతన్య సతీమణి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సమంత తాజాగా.. ఓ యంగ్ హీరో ఫిజిక్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

news18-telugu
Updated: November 7, 2019, 12:16 PM IST
అతడి బాడీ క్రేజీ.. యంగ్ హీరోపై సమంత అక్కినేని కామెంట్..
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
  • Share this:
సమంత.. అక్కినేని ఇంటి కోడలు.. హీరో నాగచైతన్య సతీమణి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. మజిలీ, ఓ బేబీ సినిమాల హిట్‌తో మంచి ఊపు మీద ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం 96 సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సమంత తాజాగా.. ఓ యంగ్ హీరో ఫిజిక్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతనెవరో కాదు.. నాగ శౌర్య. నాగ శౌర్య, సమంత జంటగా ఓ బేబీ మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. అయితే.. కొత్త సినిమా కోసం నాగ శౌర్య జిమ్‌లో శ్రమిస్తున్నాడు. ఫిట్‌గా కనిపించేందుకు, తన బాడీ లుక్‌ను ఛేంజ్ చేసుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకునేలా కనిపించాడు నాగశౌర్య.

ఈ ఫోటో చూసిన సమంత ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయింది. వెంటనే.. ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్ అంటూ కామెంట్ పెట్టి.. నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది. సమంత పోస్ట్‌ను చూసిన వాళ్లంతా.. దీనిపై జోరుగా చర్చించుకుంటున్నారు. కాగా.. సమంత నటిస్తున్న 96 చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

నాగశౌర్య పోస్ట్ చేసిన ఫోటో ఇదే..
First published: November 7, 2019, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading