అక్కినేని సమంత.. చాలా రోజుల నుండి అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే విషయం సమంత క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా సమంత ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ డికేలు ఇన్‌స్టాగ్రామ్‌లో స్వాగతం పలకగా.. దాన్ని రీపోస్ట్ చేసిన సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించనున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వివిధ కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. కాగా ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్.. ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యి.. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సీజన్‌లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సీజన్‌లో సమంత మరో ప్రధాన పాత్ర పోషించనుంది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
అది అలా ఉంటే ఇటీవల సమంత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన జి.ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.