హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Remuneration: స్యామ్ జామ్ కోసం ‘ఆహా’ అనిపిస్తున్న సమంత పారితోషికం..

Samantha Remuneration: స్యామ్ జామ్ కోసం ‘ఆహా’ అనిపిస్తున్న సమంత పారితోషికం..

సమంత ‘సామ్ జామ్’ (Twitter/Photo)

సమంత ‘సామ్ జామ్’ (Twitter/Photo)

Samantha Remuneration: ఎవరండీ హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే రిటైర్ కావాల్సిందే అని కామెంట్ చేసేది.. అలాంటి వాళ్లకు అక్కినేని కోడలు సమంతను చూపించండి. దెబ్బకు నోరు మూసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ బ్రహ్మాండంగా..

ఎవరండీ హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే రిటైర్ కావాల్సిందే అని కామెంట్ చేసేది.. అలాంటి వాళ్లకు అక్కినేని కోడలు సమంతను చూపించండి. దెబ్బకు నోరు మూసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ బ్రహ్మాండంగా కొనసాగించొచ్చు అని చెప్పడానికి సమంతే నిదర్శనం. ఇప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళనాట కూడా ఈమెకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుందంటే అది మరి సమంత రేంజ్. ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంది సమంత. దాని బదులుగా డిజిటల్ మీడియాపై ఫోకస్ చేసింది. అందులో కూడా రెండు చేతులా సంపాదిస్తుంది ఈమె. ఓ వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మరోవైపు యాంకర్‌గానూ దుమ్ము దులిపేస్తుంది. లాక్ డౌన్ మొదలయ్యాక సినిమాల కంటే కూడా బిజినెస్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది స్యామ్. ఈ క్రమంలోనే ఏకమ్ స్కూల్స్.. సాకీ డ్రెస్ బ్రాండ్ ప్రచారం అంటూ ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిపోయింది. ఇదే సమయంలో డిజిటల్ మీడియాపై కూడా దృష్టి పెట్టింది అక్కినేని కోడలు. అక్కడా సక్సెస్ అయింది.

samantha 1 crore remuneration for 8 episodes of sam jam show,samantha sam jam show,samantha about sam jam show,samantha remuneration,samantha remuneration for aha 1 crore,samantha remuneration for sam jam show,samantha akkineni aha show,samantha latest show sam jam,samantha sam jam talk show,sam jam celebrity talk show,సమంత అక్కినేని,సమంత కోటి పారితోషికం,తెలుగు సినిమా
సమంత టాక్ షోలో తమన్నా (Twitter/Photo)

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో నటించింది. మనోజ్ బాజ్‌పెయీ, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌లో సమంత టెర్రరిస్టుగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు అల్లు అరవింద్ ఆహాలో ఈమె స్యామ్ జామ్ అనే టాక్ షో చేస్తుంది. సీజన్ 1 కోసం 8 ఎపిసోడ్స్ షూట్ చేస్తుంది సమంత అక్కినేని. అందులో నాలుగు ఇప్పటికే వచ్చేసాయి.

samantha 1 crore remuneration for 8 episodes of sam jam show,samantha sam jam show,samantha about sam jam show,samantha remuneration,samantha remuneration for aha 1 crore,samantha remuneration for sam jam show,samantha akkineni aha show,samantha latest show sam jam,samantha sam jam talk show,sam jam celebrity talk show,సమంత అక్కినేని,సమంత కోటి పారితోషికం,తెలుగు సినిమా
సమంత అక్కినేని (Samantha Akkineni/Instagram)

విజయ్ దేవరకొండతో మొదలైన సీజన్.. రానా, నాగ్ అశ్విన్.. సైనా నెహ్వాల్ దంపతులు.. తమన్నాతో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తర్వాతి ఎపిసోడ్‌కు ఇప్పుడు రకుల్, క్రిష్ రానున్నారు. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అర్జున్, నాగ చైతన్య ఉన్నారు. వీళ్లతో సీజన్ 1 అయిపోతుంది. అయితే ఈ 8 ఎపిసోడ్స్ కోసం సమంత ఏకంగా కోటి రూపాయల పారితోషికం అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె రేంజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 8 లక్షలకు పైగానే వసూలు చేస్తుంది స్యామ్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు