సమంత దూకుడు మాములుగా లేదుగా.. మామ నాగార్జునకు కూడా ఒదిలిపెట్టడం లేదుగా..
పేకాట పేకాటే.. బామ్మర్ధి బామ్మర్ధి అన్నట్టు ఉంది సమంత చేస్తున్న పనులు చూస్తుంటే.. వివరాల్లోకి వెళితే..సమంత కూడా పెళ్లైన తర్వాత వరుస సినిమాలతో దూకుడు మీదుంది. అంతేకాదు నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కథానాయికగా సమంత రేంజ్ ఇంకా పెరిగింది. దీంతో ‘మన్మథుడు 2’లో చేస్తోన్న గెస్ట్ పాత్రకు కూడా సమంత ఓ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
news18-telugu
Updated: June 2, 2019, 12:02 PM IST

నాగార్జున సమంత
- News18 Telugu
- Last Updated: June 2, 2019, 12:02 PM IST
పేకాట పేకాటే.. బామ్మర్ధి బామ్మర్ధి అన్నట్టు ఉంది సమంత చేస్తున్న పనులు చూస్తుంటే.. వివరాల్లోకి వెళితే..సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కైన పెళ్లైన తర్వాత కెరీర్ దాదాపు ఎండ్ అనే చెప్పాలె. ఏదో షావుకారు జానకి, సావిత్రి, హేమా మాలిని వంటి వారు మినహాయింపు అనే చెప్పాలె. వీళ్లందరు కూడా పెళ్లైన తర్వాత హీరోయిన్గా చాలా ఏళ్లు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇపుడు అదే రూట్లో సమంత కూడా పెళ్లైన తర్వాత వరుస సినిమాలతో దూకుడు మీదుంది. అంతేకాదు నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కథానాయికగా సమంత రేంజ్ ఇంకా పెరిగింది. ఈ ఇయర్ ‘సూపర్ డీలక్స్’తో పాటు తన నిజ జీవిత భాగస్వామి నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా సూపర్ హిట్టైవ్వడంతో సమంత జోరు మాములుగా లేదు. మరోవైపు ఈమె ప్రధానా పాత్రలో నటించిన ‘ఓ బేబి’ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. మరోవైపు సమంత.. ‘మన్మథుడు 2’లో గెస్ట్ రోల్ చేస్తోంది. ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పోర్చుగల్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మన్మథుడు 2 షూటింగ్ పిక్
‘వెంకీ మామ’తో తన కోరిక నెరవేరిందన్న వెంకటేష్..
అభిమానులకు ‘వెంకీ మామ’ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..
స్టార్ డైరెక్టర్ చిత్రంలో మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..
సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యం అయింది..
సమంతను కన్నీరు పెట్టించిన నాగ చైతన్య అభిమాని..
మామ నాగార్జున బాటలో అక్కినేని కోడలు సమంత..
ఇక సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోన్న సమంత... ఇందులో యాక్ట్ చేయడానికి భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటోందని టాలీవుడ్ సమాచారం. మాములుగా సమంత..ఒక్కో సినిమాకు రూ.15. కోట్ల నుంచి 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక ఈసినిమాలో 15 నిమిషాల నిడివిగల పాత్ర కోసం దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఎంత మామ హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి. ఏదో కొద్దిగా ఛార్జ్ చేస్తుందనుకుంటే..ఇపుడు ‘మన్మథుడు 2’ కోసం భారీగానే డిమాండ్ చేయడం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Loading...
Loading...