అక్కినేని ఇంటి కోడలైన సమంత.. ఇపుడు తన పేరును మార్చుకుంది. ఏంటి ఏదో జోక్‌గా చెబుతున్నారనుకుంటున్నారా ? నిజంగానే అక్కినేని సమంత తన పేరును బేబి అక్కినేనిగా మార్చేసుకుంది. అది కూడా తన ట్విట్టర్ అకౌంట్లో. పెళ్లైన తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమంత.. ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ ఫుల్ హ్యాపీగా ఉంది. తాజాగా సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే...అనుకోకుండా ఆ పెద్దావిడా..పాతికేళ్ల భామగా మారిపోతుంది. ఆమెకు అదెలా సాధ్యమైందనేదే ‘ఓ బేబి’ స్టోరీ. ఈ సినిమాలో ఓల్డ్ లేడీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. యంగ్ పాత్రను సమంత పోషించింది. ఓల్డ్ నుంచి యంగ్ మారడంతో ఏర్పడిన కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.
Thankyou 😊 https://t.co/3vqDPJH76R
— Baby Akkineni (@Samanthaprabhu2) May 31, 2019
ఈ సినిమా కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన ట్విట్టర్లో అకౌంట్లో తన పేరును ‘బేబి అక్కినేని’గా మార్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేసారు. మరి ఈ ప్రమోషన్ ‘ఓ బేబి’ సినిమాకు ఎంత కలిసొస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Nandini Reddy, Oh Baby, Samantha, Suresh Babu, Suresh Productions, Tamil Cinema, Telugu Cinema, Tollywood