Samantha Sri Reddy: మీ అత్త అమల ఎలా ఉన్నారు.. నువ్వెలా ఉన్నావ్.. సమంతపై శ్రీ రెడ్డి ఫైర్..

సమంత శ్రీ రెడ్డి

Samantha Sri Reddy: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎవరో ఒకరిపై నోరు పారేసుకోకపోతే శ్రీ రెడ్డికి పూట గడవదు. ఈమె సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా పెద్దింటి కోడళ్లు, కొడుకులతో పాటు వారసులను..

  • Share this:
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎవరో ఒకరిపై నోరు పారేసుకోకపోతే శ్రీ రెడ్డికి పూట గడవదు. ఈమె సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా పెద్దింటి కోడళ్లు, కొడుకులతో పాటు వారసులను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది శ్రీ రెడ్డి. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సమంత అక్కినేనిని లక్ష్యంగా చేసుకుని ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులకు పిచ్చ కోపం తెప్పిస్తున్నాయి. కనిపిస్తే చంపేస్తామంటూ ఈమెపై సోషల్ మీడియాలో తిరిగి కౌంటర్స్ వేస్తున్నారు వాళ్లు. అసలేం జరిగిందంటే పెళ్లి తర్వాత కూడా సమంత దూసుకుపోతుంది. ఇప్పటికీ హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది అక్కినేని కోడలు. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్యామ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ మోడ్రన్‌గానే ఉంటుంది.. పెళ్లైంది కదా గ్లామర్ షోకు దూరంగా ఉందాం అనే మాటలు సమంత బుర్రలో లేవు. ఎందుకంటే మొన్నటికి మొన్న తన క్లోత్ షోరూం కోసం అదిరిపోయే క్లీవేజ్ షో చేసింది సమంత. అది చూసి అంతా షాక్ అయ్యారు. వామ్మో అక్కినేని కోడలు అయ్యుండి కూడా అంతగా రెచ్చిపోతుంది ఏంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్లీవేజ్ షోపైనే షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.
sri reddy,sri reddy twitter,sri reddy facebook,sri reddy samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni hot show,samantha akkineni hot cleavage show,samantha akkineni hot dressing,samantha akkineni sri reddy comments,telugu cinema,సమంత అక్కినేని,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి సమంత అక్కినేని డ్రెస్సింగ్,సమంత హాట్ డ్రెస్సింగ్‌పై విరుచుకుపడిన శ్రీ రెడ్డి
సమంత శ్రీరెడ్డి ఫైల్ ఫోటోస్

‘సమంతా.. ఏంటి ఆ డ్రెస్సులు బీభత్సంగా..! అక్కినేని ఫ్యామిలీలో అమలా గారు ఎంత మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటారు.. మ్యారేజ్ తర్వాత.. ఇప్పటికీ ఆమెను చూస్తే యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా.. పశువుల మీద ప్రేమతో సంస్థను ప్రారంభించడం.. పిల్లలను పెంచడం ఎన్నో మంచి పనులు చేస్తుంటుంది. ఇక నాగార్జున నాకు పర్సనల్‌గా నచ్చరు.. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నీకు ఓ ఫ్యాన్‌గా చెప్తున్నా.. నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదంటూ’ చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. అంతటితో ఆగకుండా నమ్రత దగ్గరికి కూడా వచ్చింది ఈ భామ.
sri reddy,sri reddy twitter,sri reddy facebook,sri reddy samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni hot show,samantha akkineni hot cleavage show,samantha akkineni hot dressing,samantha akkineni sri reddy comments,telugu cinema,సమంత అక్కినేని,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి సమంత అక్కినేని డ్రెస్సింగ్,సమంత హాట్ డ్రెస్సింగ్‌పై విరుచుకుపడిన శ్రీ రెడ్డి
అమల అక్కినేని నమ్రత శిరోద్కర్ (amala namrata)

‘కావాలంటే నమ్రత శిరోద్కర్‌ను చూడండి.. మహేష్ బాబు అంత ఎదగడంలో నమ్రత శిరోద్కర్ కారణం.. నాగచైతన్యకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేవు.. అంత క్రేజ్ లేదు.. నువ్వు కూడా అతని కెరీర్ చూసుకోవచ్చు కదా.. ఎందుకిలా బట్టలిప్పుకుని ఈ రచ్చ ఎందుకు..? పోనీ అవేమైనా నీకు సూట్ అయ్యాయా అంటే అది లేదు.. నువ్ సెక్సీగా ఉండవు సమంత.. నువ్ నీ అందాలన్నీ చూపించినా కూడా సూట్ కాలేదు.. నీకు క్యూట్‌నెస్ ఉంది కానీ హాట్‌నెస్ లేదనే విషయం తెలుసుకో సమంత.. దయచేసి ఈ బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకు.. మనం సౌత్ అమ్మాయిలం.. పెళ్లి తర్వాత నేను ఇలా ఉండను.. నువ్వు తమిళ్ అమ్మాయివి.. కానీ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్.. పెళ్లయ్యాక లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్.. అభిమానులుగా మాకు అది అస్సలు నచ్చడం లేదు.. నాగ చైతన్య లైఫ్ మీద, సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టండి సమంత అంటూ సలహాలు ఇచ్చింది శ్రీ రెడ్డి.
Published by:Praveen Kumar Vadla
First published: