హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రపై దారుణమైన ట్రోలింగ్..

Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రపై దారుణమైన ట్రోలింగ్..

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ పై బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ (Youtube/Amazon Prime/Photo)

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ పై బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ (Youtube/Amazon Prime/Photo)

Samantha Akkineni :  సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్రలపై కొంత మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Samantha Akkineni :  సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అక్కినేని భామ.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించింది. గతంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎపుడు విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్ ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వస్తోంది.  తాజాగా ఈ వెబ్ సిరీస్‌ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత LTTE టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తోంది. దీనిపై తమిళ ఆడియన్స్ నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. పుట్టుకతో తమిళురాలైన సమంత.. ఇలాంటి పాత్రలో కనిపిస్తుండంతో తమిళ ఆడియన్స్‌ను ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాళ్లు LTTE అనేది శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన సంస్థ అని వాదిస్తున్నారు. అంతేకానీ.. అదో ఉగ్రవాద సంస్థ కాదంటున్నారు. అలాంటి తమిళ టైగర్స్‌ను టెర్రరిస్టులుగా చూపిస్తారా అని తమిళ జనాలు మండిపడుతున్నారు. ఇలాంటి పాత్రలో నటించడానికి సమంతకు నిజంగా సిగ్గులేదా అని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.  మిగతా భాషల్లో ఆడియన్స్‌ను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు సమంత ఈ పాత్రలో అదరగొట్టిందిని చెబుతున్నారు. ఈ సిరీస్‌లో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న సమంతకు ఇపుడు తమిళ ఆడియన్స్‌ను ట్రోల్స్ ఎదురుకావడంతో కాస్తంత ఇబ్బంది పడుతోంది. మొత్తంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురైన ఈ వెబ్ సిరీస్‌కు ఇపుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్  మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై నేపథ్యంలో సాగనుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్‌లో మనోజ్ బాజ్ పాయ్ అదరగొట్టారు. ఇక ఈ సీజన్‌లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. అసలు ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత ఓ టెర్రిరిస్టు లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్. ఈ కొత్త సీజన్ వచ్చే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో వచ్చే రెండవ సీజన్‌పై మంచి అంచనాలున్నాయి. సమంత ఈ వెబ్ సీరీస్‌లో రాజీ పాత్రలో కనిపించనుంది. ఈ సీజన్ ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ కానుంది.' isDesktop="true" id="881650" youtubeid="NGf_B81Hc2M" category="movies">

ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్‌లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ద్వయం తాజాగా ఓ ఇండీ ఫిల్మ్‌ను కూడా నిర్మించారు. సినిమా బండి పేరుతో వచ్చిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు.

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో ‘కాతు వాకుల2 ‘రెండు కాదల్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతంలలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.

First published:

Tags: Bollywood news, Samantha akkineni, Tollywood

ఉత్తమ కథలు