తెలుగు ఇండస్ట్రీలో సోషల్ మీడియాతో చెడుగుడు ఆడుకునే హీరోయిన్స్‌లో అందరికంటే ముందుంటుంది సమంత అక్కినేని. ఈమెకు స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. తుమ్మినా దగ్గినా కూడా అభిమానులతో పంచుకుంటుంది సమంత అక్కినేని. అలాంటిది కొన్ని రోజుల నుంచి ఈమె అస్సలు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఉన్నట్లుండి మాయమైపోవడంతో సమంతకు ఏమైంది.. అంతా ఓకే కదా అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. పైగా ఈమె గర్భం దాల్చిందని.. అందుకే సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఫిక్సైపోయిందనే ప్రచారం కూడా జరిగింది.
అయినా కూడా గాసిప్స్ వచ్చేవి రానీ అన్నట్లు సమంత అస్సలు రియాక్ట్ కాలేదు. కరోనా మహమ్మారి ఇంతగా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతా దీని గురించి చెబుతుంటే సమంత మాత్రం ఒక్కసారి కూడా ఫ్యాన్స్‌కు కానీ.. ఆడియన్స్‌కు కూడా కరోనా జాగ్రత్తలు చెప్పలేదు. అంతేకాదు ఎలాంటి విరాళం కూడా ప్రకటించలేదు.
ఇంత బాధ్యత లేకుండా ఎలాంటి ఉంటారంటూ సమంతపై కొందరు నెటిజన్స్ ఫైర్ కూడా అయ్యారు. అయితే అందరి సస్పెన్స్‌కు తెర దించుతూ తాజాగా సమంత మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. తన పప్పీతో దిగిన ఫోటోను షేర్ చేసి బ్యాక్ ఫ్రమ్ మై లాంగ్ స్లీప్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే గాఢనిద్ర నుంచి మేల్కొందని అర్థం. ఇప్పటికైనా కరోనా జాగ్రత్తలతో పాటు విరాళం ఏమైనా ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood