పబ్‌లో పాప్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన సమంత, నాగ చైతన్య..

Samantha Akkineni : సమంత అక్కినేని, నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 

news18-telugu
Updated: September 1, 2019, 10:57 AM IST
పబ్‌లో పాప్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన సమంత, నాగ చైతన్య..
సమంత, నాగ చైతన్య..
  • Share this:
Samantha Akkineni : సమంత అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  అక్కడి ఐబిజా ద్వీప అందాలను ఆస్వాదిస్తున్నారు. మామా నాగార్జున తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరిపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు కోడలు సమంత, కొడుకు నాగచైతన్య హాజరైయారు. అందులో భాగంగా..సమంత, నాగ చైతన్య జంట అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తోంది. బీచ్ పక్కన ఓ కుర్చిలో కూర్చున్న సమంత ఫోటోను నాగ చైతన్య క్లిక్ మనించగా... ఆ ఫోటోను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ జంట అక్కడి లోకల్ పబ్‌లో ఓ అమెరికన్ పాప్ సాంగ్‌కు ఊగుతూ.. అదరగొట్టింది. దానకిి సంబందించిన ఆ వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సమంత సూపర్‌గా డ్యాన్స్ చేస్తుండగా నాగ చైతన్య కూడా పాటకు స్టెప్పులేశాడు.
 View this post on Instagram
 

My 🍳 @chayakkineni 🤴🏽 .... PC @shilpareddy.official 💓


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

సమంత ప్రస్తుతం.. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. కాగా ఇటీవల సమంత చేసిన సినిమాలన్నీ  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే.

Published by: Suresh Rachamalla
First published: September 1, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading