Home /News /movies /

SAMANTHA AKKINENI AMAZON PRIME WEB SERIES THE FAMILY MAN SEASON 2 TRAILER RELEASED AND STREAMING FROM JUNE 14 SR

Samantha Akkineni : టెర్రరిస్టుగా సమంత... అదిరిన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్..

samantha akkineni Photo : Twitter

samantha akkineni Photo : Twitter

Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

    Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దీనికి సంబంధించి ఈరోజు ట్రైలర్‌తో పాటు ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వనుందో అనే విషయాన్ని టీమ్ ప్రకటించింది. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి సీజన్ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కూడా మంచి ఇంటెన్స్ లుక్’లో కనిపిస్తోంది. మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై నేపథ్యంలో సాగనుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్‌లో మనోజ్ బాజ్ పాయ్ అదరగొట్టారు. ఇక ఈ సీజన్‌లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. అసలు ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత ఓ టెర్రిరిస్టు లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్. ఈ కొత్త సీజన్ వచ్చే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో వచ్చే రెండవ సీజన్‌పై మంచి అంచనాలున్నాయి. సమంత ఈ వెబ్ సీరీస్‌లో రాజీ పాత్రలో కనిపించనుంది. ఈ సీజన్ ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ కానుంది.


    ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్‌లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ద్వయం తాజాగా ఓ ఇండీ ఫిల్మ్‌ను కూడా నిర్మించారు. సినిమా బండి పేరుతో వచ్చిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు.

    ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతంలలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Samantha akkineni, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు