హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni : సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ తరుణం రానే వచ్చింది..

Samantha Akkineni : సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ తరుణం రానే వచ్చింది..

Samantha Photo : Instagram

Samantha Photo : Instagram

Samantha Akkineni : నటి సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించిన సంగతి తెలిసిందే.

Samantha Akkineni : నటి సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ అనేక వివాదాల నడుమ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ వెబ్ సీరిస్‌లో సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించింది. రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్‌, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించింది. నెటిజన్స్ ప్రశంసలు అందుకుంది. అది అలా ఉంటే ఈ వెబ్ సిరీస్ మొదట్లో హిందీ, ఇంగ్లీష్ భాషాల్లో అందుబాటులోకి రాగా.. తాజాగా తెలుగు, తమిళ భాషాల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. దీంతో సమంత తెలుగు తమిళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమిళ వర్షన్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నామని.. ఇన్నాళ్లకు తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమ్ అవడం ఆనందంగా ఉందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఉండే ఈ సిరీస్ లో నటుడు మనోజ్ భాజ్ పై మెయిన్ లీడ్ లో నటించారు.

గత సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండవ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ వెబ్ సీరిస్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై, శ్రీలంక నేపథ్యంగా సాగింది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్‌లో మనోజ్ బాజ్ పాయ్ కనిపించి అదరగొట్టారు.

ఇక మరోవైపు కొందరు అనుకున్నట్లు ఈ వెబ్ సీరిస్ తమిళులకు వ్యతిరేకంగా ఏమి లేదని తేలింది. ఈ వెబ్ సీరిస్‌లో తమిళ శ్రీలంకన్స్‌ను బ్యాడ్‌ క్యారెక్టర్‌లో చూపించారని తమిళనాడులో వివాదం చెలరేగింది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఈ వెబ్ సీరిస్‌ను బ్యాన్ చేయాలనీ.. ఆ లేఖలో కోరింది. ఇక ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

First published:

Tags: Akkineni samantha, Family man 2 series, Tollywood news

ఉత్తమ కథలు