Home /News /movies /

SAMANTHA AKKINENI ABOUT ON WORKING WITH NAYANATARA AND VIJAY SETHUPATHI MHN

Samantha Akkineni: అనుకోలేదేనాడూ... రెండు ల‌క్కులు ఒకేసారి కిక్కిస్తాయ‌ని... అని అంటున్న స‌మంత‌!

Samantha Akkineni about on working with Nayanatara and Vijay Sethupathi

Samantha Akkineni about on working with Nayanatara and Vijay Sethupathi

Samantha Akkineni: రీజ‌న్ కొత్త‌ది కాక‌పోయినా, తాను చేస్తున్న ప‌ని కూడా సగంలోనే ఉన్నా, తాను మాత్రం ఫుల్ హ్యాపీస్ అని డైర‌క్ట్ గా చెప్పేస్తోంది స‌మంత‌. ఇంతకీ ఆ రీజనేంటో తెలుసా..

    అనుకోలేదేనాడూ ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుంద‌నీ... అని జోరుగా హుషారుగా పాట పాడుతున్నారు స‌మంత‌. దానికి రీజ‌న్ ఉంది. అయితే ఆ రీజ‌న్ కొత్త‌ది కాక‌పోయినా, తాను చేస్తున్న ప‌ని కూడా సగంలోనే ఉన్నా, తాను మాత్రం ఫుల్ హ్యాపీస్ అని డైర‌క్ట్ గా చెప్పేస్తోంది స‌మంత‌. దానికి రీజ‌న్ లేక‌పోలేదు... స‌మంత ఇప్పుడు కాత్తువాక్కులే రెండు కాద‌ల్ అని ఒక సినిమా చేస్తున్నారు. అందులో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ కూడా న‌టిస్తున్నారు. వారిద్ద‌రితో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కెప్పుడూ ఫెస్టివ్ మూడ్‌లాగానే ఉంటుంద‌న్న‌ది స‌మంత ఫీలింగ్‌. ఆ విష‌యాన్నే సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ అట్రాక్ట్ చేస్తుంద‌ని చెబుతూనే, విఘ్నేష్ శివ‌న్‌ని ఆకాశానికి ఎత్తేశారు.

    ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా పూర్త‌యింది. రీసెంట్‌గా చెన్నైలో ఈ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ గురించి డీటైల్స్ ఇంకా చెప్ప‌లేదు. ఆల్రెడీ త‌మ ఫ‌స్ట్ ప్రొడ‌క్ష‌న్ వెంచ‌ర్ కూళాంగ‌ళ్‌కి ఇంట‌ర్నేష‌న‌ల్ టైగ‌ర్ అవార్డు రావ‌డంతో న‌య‌న్ అండ్ విఘ్నేష్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఇప్పుడు త‌మ‌కు మోస్ట్ ల‌క్కీయెస్ట్ ప‌ర్స‌న్ విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్‌లో కాత్తువాక్కులే రెండు కాద‌ల్ సినిమా చేస్తున్నారు. ఇంత స‌ర‌దా టీమ్‌తో ప‌నిచేస్తున్నందుకు అక్కినేని కోడ‌లు కూడా అంతే ఇదిగా ఎగ్జ‌యిట్ అవుతున్నారు.



    మ‌రోవైపు స‌మంత న‌టించిన ఫ్యామిలీ మేన్ 2 స‌మ్మ‌ర్‌లో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ శాకుంత‌లం శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉంది. సో అవ‌న్న‌మాట నాగ్ కోడ‌లి బిజీ షెడ్యూల్ అండ్ స‌ర‌దా క‌బుర్ల సంగ‌తులు..!
    Published by:Anil
    First published:

    Tags: Nayanathara, Samantha, Vijay Sethupathi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు