Samantha Akkineni@11Years: టాలీవుడ్‌లో సమంత అక్కినేని నట ప్రస్థానానికి 11 యేళ్లు పూర్తి..

సమంత నట ప్రస్థానాానికి 11 యేళ్లు (Twitter/Photo)

Samantha Akkineni@11Years: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన సమంత అక్కినేని ఆ తర్వాత వెనదిరిగి చూసుకోలేదు. ఇక తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ రోజు సమంత హీరోయిన్‌గా పదకొండేళ్లు కంప్లీట్ చేసుకుంది. నటిగా ఆమె కెరీర్‌ను ఛేంజ్ చేసిన సినిమాల విషయానికొస్తే..

 • Share this:
  Samantha Akkineni@11Years: సమంత అక్కినేని.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. గతేడాది సమంత.. ‘జాను’ సినిమాతో పలకరించింది. తమిళ సూపర్ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మంచి టాక్ సంపాదించుకున్న కమర్షియల్‌గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక నటిగా సమంత.. ఫిబ్రవరి 25తో  (శుక్రవారం)తో 11 యేళ్ల  కెరీర్ కంప్లీట్ చేసుంది. ఈ పదకొండేళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్  హిట్ చిత్రాల్లో నటించింది. దాంతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  .సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’.

  ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

  11 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సమంత అక్కినేని (Twitter/Photo)


  ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందుగా.. గ్లామర్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది. ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది. ఇక నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయిన యువతిగా అద్భుతంగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఈగ సహాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా సమంత నటన ఆకుట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో మరదలు శశిగా గ్లామర్ ఒలకబోస్తూనే తనదైన నటనతో మెప్పించింది.

  Samantha Akkineni 11 years cine career completed these are the films changed her life,Samantha Akkineni@11Years: టాలీవుడ్‌లో సమంత అక్కినేని నట ప్రస్థానానికి 11 యేళ్లు పూర్తి..,samantha akkineni,Samantha Akkineni Completed 11 Years in Film Industry,samantha,Naga chaitanya Samantha Em Maya Chesave,Em Maya Chesave Completed 11 Years,Samantha Akkineni instagram,Samantha Akkineni twitter,Samantha Akkineni facebook,samantha Completed As a Heroin 10 yearssamantha akkineni 10 years,samantha,samantha twittNaga chaitanya Samantha Em Maya Chesave,samantha movies,samantha akkineni movies,samantha ruth prabhu,samantha akkineni car,samantha akkineni die hart fans,samantha interviews,samantha akkineni interviews,samantha akkineni telugu actress,samantha akkineni house,samantha akkineni launches,samantha akkineni middle man,samantha akkineni income,samantha akkineni hot,samantha akkineni family,samantha akkineni lifestyle,samanatha akkineni,సమంత నాగ చైతన్య రెండో వివాహా మహోత్సవం,'సమంత 11 ఏళ్లు, సమంత నాగచైతన్యల ప్రేమకు 11 ఏళ్లు,సమంత 11 ఏళ్లు,హీరోయిన్‌గా 11 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సమంత అక్కినేని,సమంత అక్కినేని 11 ఏళ్లు
  సమంత అక్కినేని@11 ఇయర్స్ (Twitter/Photo)


  ఆ తర్వాత అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో ప్రియగా నటించింది. యాదృచ్ఛికమో కానీ ఆ తర్వాత సమంత అక్కినేని వారింటి కోడలు అయింది. ఇక ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణిగా.. ఆ తర్వాత  సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సమంత నట జీవితంలో ఈ క్యారెక్టర్ మేలిమలుపు అనే  చెప్పాలి. ఆ తర్వాత తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’లో సామాన్య గృహిణిగా మెప్పించింది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో ముసలావిడ పాత్రలో నటిస్తూనే చిలిపితనం ఒలకబోసింది.

  samantha akkineni naga chaitanya super hit film majili to dubbed in hindi here are the details,Naga Chaitanya,samantha,naga chaitanya samanhta majili.naga chaitanya samanhta majili hindi version,naga chaitanya samanhta majili hindi dubbed version, naga chaitanya samantha,samantha twitter,samantha instagram,samantha facebook,naga chaitanya twitter,naga chaitanya facebook,naga chaitanya instagram,Naga Chaitanya Parasuram,naga chaitanya samantha parasuram,Naga Chaitanya Vijay Devarakonda Parasuram Directin, Naga chaitanya Parasuram Direction, Naga Chaitanya Next Movie With Geetha Govindam Fame Parashuram Direction, Tollywood News, Telugu cinema, నాగ చైతన్య, నాగ చైతన్య పరశురామ్, నాగ చైతన్య విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్, అక్కినేని నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్, తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్,పరశురామ్,పరశురామ్ నాగచైతన్య,నాగ చైతన్య,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్
  భర్త  నాగ చైతన్య, సమంత (Twitter/photo)


  నేడు సమంత హీరోయిన్‌గా పదకొండేళ్లు పూర్తి చేసుకుంది.  నటిగా 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. గతేడాది సమంత.. కరోనా సమయంలోనే ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో విలన్‌ పాత్రలో నటించింది. త్వరలో ఈ వెబ్ సిరీస్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్ అంటూ సందడి చేసింది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాతో పలకరించబోతుంది.

  samantha akkineni, star heroine samantha akkineni, tollywood heroine samantha akkineni, shakuntalam, director guna sekhar, guna sekhar shakuntalam, samantha as sakuntala, producer dilraju, సమంత అక్కినేని, శాకుంతలం, దర్శకుడు గుణ శేఖర్, నిర్మాత దిల్‌రాజు
  ’శాకుంతలం’ సినిమాలో సమంత (Twitter/Photo)


  సమంత తన కెరీర్‌లో చేస్తోన్న తొలి పౌరాణిక సినిమా ఇదే. ఈ సినిమా దుష్యంతుడి పాత్రలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తంగా పెళ్లి తర్వాత కూడా సమంత కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతూనే ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: