Samantha@10Years: సమంత పదేళ్ల నట జీవితంలో కీలక సినిమాలు ఇవే..

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన సమంత అక్కినేని ఆ తర్వాత వెనదిరిగి చూసుకోలేదు. ఇక తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ రోజు సమంత హీరోయిన్‌గా పదేళ్లు కంప్లీట్ చేసుకుంది. నటిగా ఆమె కెరీర్‌ను ఛేంజ్ చేసిన సినిమాల విషయానికొస్తే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 26, 2020, 3:07 PM IST
Samantha@10Years: సమంత పదేళ్ల నట జీవితంలో కీలక సినిమాలు ఇవే..
సమంత అక్కినేని (Twitter/Photo)
  • Share this:
సమంత అక్కినేని.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. తాజాగా సమంత.. ఈమె ‘జాను’ సినిమాతో పలకరించింది. తమిళ సూపర్ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మంచి టాక్ సంపాదించుకున్న కమర్షియల్‌గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక నటిగా సమంత.. ఈ రోజుతో పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుంది. ఈ దశాబ్ద కాలంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దాంతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.   ఈ సందర్బంగా సమంత గతంలో చేసి ఘన విజయాలు అందుకున్న సినిమాలు, ఆమె పాత్రల తీరును చూద్దాం..సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’.  ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

Samantha Akkineni 10 years cine career completed these are the films changed her life,Samantha@10Years: సమంత పదేళ్ల నట జీవితంలో కీలక సినిమాలు ఇవే..,samantha akkineni,Samantha Akkineni Completed 10 Years in Film Industry,samantha,Naga chaitanya Samantha Em Maya Chesave,Em Maya Chesave Completed 10 Years,Samantha Akkineni instagram,Samantha Akkineni twitter,Samantha Akkineni facebook,samantha Completed As a Heroin 10 yearssamantha akkineni 10 years,samantha,samantha twittNaga chaitanya Samantha Em Maya Chesave,samantha movies,samantha akkineni movies,samantha ruth prabhu,samantha akkineni car,samantha akkineni die hart fans,samantha interviews,samantha akkineni interviews,samantha akkineni telugu actress,samantha akkineni house,samantha akkineni launches,samantha akkineni middle man,samantha akkineni income,samantha akkineni hot,samantha akkineni family,samantha akkineni lifestyle,samanatha akkineni,సమంత నాగ చైతన్య రెండో వివాహా మహోత్సవం,'సమంత 10 ఏళ్లు, సమంత నాగచైతన్యల ప్రేమకు 10 ఏళ్లు,సమంత 10 ఏళ్లు,హీరోయిన్‌గా 10 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సమంత అక్కినేని,సమంత అక్కినేని 10 ఏళ్లు
‘ఏమాయ చేసావె’ సినిమా విడుదలై నేటికి పదేళ్లు (Twitter/Photo)


ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందు..గా గ్లామర్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది. ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది. ఇక నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయిన యువతిగా అద్భుతంగా ఒదిగపోయింది. ముఖ్యంగా ఈగ సహాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా సమంత నటన ఆకుట్టుకునేల ఉంటుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో మరదలు శశిగా గ్లామర్ ఒలకబోస్తూనే తనదైన నటనతో మెప్పించింది.

పదేళ్ల కెరీర్‌లో విభిన్న పాాత్రల్లో మెప్పించిన సమంత (Twiter/Photo)


ఆ తర్వాత అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో ప్రియగా నటించింది. యాదృచ్ఛికమో కానీ ఆ తర్వాత సమంత అక్కినేని వారింటి కోడలు అయింది. ఇక ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణిగా.. ఆ తర్వాత  సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సమంత నట జీవితంలో ఈ క్యారెక్టర్ మేలిమలుపు అనే  చెప్పాలి. ఆ తర్వాత తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’లో సామాన్య గృహిణిగా మెప్పించింది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో ముసలావిడ పాత్రలో నటిస్తూనే చిలిపితనం ఒలకపోసింది.

samantha akkineni naga chaitanya super hit film majili to dubbed in hindi here are the details,Naga Chaitanya,samantha,naga chaitanya samanhta majili.naga chaitanya samanhta majili hindi version,naga chaitanya samanhta majili hindi dubbed version, naga chaitanya samantha,samantha twitter,samantha instagram,samantha facebook,naga chaitanya twitter,naga chaitanya facebook,naga chaitanya instagram,Naga Chaitanya Parasuram,naga chaitanya samantha parasuram,Naga Chaitanya Vijay Devarakonda Parasuram Directin, Naga chaitanya Parasuram Direction, Naga Chaitanya Next Movie With Geetha Govindam Fame Parashuram Direction, Tollywood News, Telugu cinema, నాగ చైతన్య, నాగ చైతన్య పరశురామ్, నాగ చైతన్య విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్, అక్కినేని నాగ చైతన్య పరశురామ్ డైరెక్షన్, తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్,పరశురామ్,పరశురామ్ నాగచైతన్య,నాగ చైతన్య,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్,మజిలీ హిందీ డబ్బింగ్ వెర్షన్
భర్త  నాగ చైతన్య, సమంత (Twitter/photo)


నేడు సమంత హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి నటిగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది.  పోయిన సంవత్సరం లాగే.. ఈ ఏడాది కూడా సమంత హీరోయిన్‌గా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 26, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading